బతుకమ్మలోనూ వీడని వివక్షత

యాదాద్రి జిల్లా:తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగలో దళిత మహిళలకు ఘోర అవమానం జరిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో సోమవారం జరిగింది.

బతుకమ్మ పండగ చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా కలిసి సద్దుల బతుకమ్మ సంబురాలు జరుపుకునేందుకు గ్రామంలోని రామాలయం వద్ద ఏర్పాట్లు చేశారు.

మహిళలు బతుకమ్మలను తీసుకొని అక్కడికి చేరుకున్నారు.ఈ సమయంలో గ్రామానికి చెందిన దళిత మహిళలు కూడా బతుకమ్మలను ఎత్తుకొని ఆడేందుకు వచ్చారు.

దీనితో గ్రామానికి చెందిన అగ్రవర్ణ మహిళలు బతుకమ్మ సంబరాలలో దళితులు పాల్గొన వద్దని అంటూ దళిత మహిళలు బతుకమ్మలను మధ్యలో పెట్టగానే మిగిలిన మహిళలు వారి బతుకమ్మలను పక్కకు జరువుకున్నారు.

అంతటితో ఆగకుండా మైకులు బంద్ చేయాలని నిర్వాహకులకు హుకుం జారీ చేశారు.సాటి మహిళల పట్ల మితగా వారు ప్రవర్తించిన తీరు అందర్నీ ఆశ్చర్య పరిచింది.

తమపై కుల వివిక్ష చూపారని భావించిన దళిత మహిళలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలిసిన దళిత సంఘాల నేతలు జరిగిన సంఘటనను ఖండించారు.దళిత మహిళల పట్ల గ్రామ ప్రజల సమక్షంలో అవమానానికి గురి చేసిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సావిత్రిని “బ్రహ్మరాక్షసి” అని పిలిచిన ఎస్వీఆర్.. ఆమె రియాక్షన్ ఏంటంటే..