మోసపోయిన శ్రీహరి.. అలా అప్పులు తీర్చిన డిస్కో శాంతి.. వైరల్ న్యూస్!

తెలుగు సినీ ప్రేక్షకులకు దివంగత నటుడు శ్రీహరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోగా,విలన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీహరి.

ఇక శ్రీహరి కెరిర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

చనిపోయేటప్పటికి కూడా ఆయన షూటింగ్ లోనే ఉన్నారు.ఇక రియల్ లైఫ్ లో ఎంతోమందికి కాదనకుండా సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు శ్రీహరి.

అయితే శ్రీహరి చేసిన ఎన్నో దానధర్మాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన భార్య డిస్కో శాంతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా శాంతి మాట్లాడుతూ.మాకు రెమ్యూనరేషన్ కరెక్ట్ గా వచ్చి ఉంటే నేను ఒక పది ఇల్లులు కొని ఉండేదాన్ని.

శ్రీహరి చనిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇంటిపై అప్పులు ఉంటే నగలన్నీ అమ్మేసి తీర్చేశాను.

అలాగే కార్లు కూడా అమ్మేశాను.శ్రీహరి సినిమాలో నటించే సమయంలో చిరంజీవి గారి సంస్థ అలాగే రెండు మూడు సంస్థలు మాత్రమే రెమ్యూనరేషన్ కరెక్ట్ గా ఇచ్చేవారు.

"""/" / చాలామంది శ్రీహరిని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు అని తెలిపింది శాంతి.

శ్రీహరి బావకి సినిమా అంటే పిచ్చి ఉండడంతో డబ్బులు ఇవ్వకపోయినా సినిమాలు చేయమని నేనే చెప్పేదాన్ని.

40 50 ఏళ్ల వయసు వచ్చినా కూడా తండ్రి ఇలా ఏదో ఒక పాత్ర వస్తుంటుంది కాబట్టి చేయమని చెప్పే దానిని అని తెలిపింది శాంతి.

ఇక మా బావ చనిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అని చాలామంది అడిగే వారు కానీ సినిమాలు లేను కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు.

మెడ మొత్తం నల్లగా అసహ్యంగా మారిందా.. ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోండిలా..!