అక్కినేని ముందు కాలేజ్ స్టూడెంట్ ని చితక్కొట్టిన డిస్కో శాంతి
TeluguStop.com
డిస్కోశాంతి.ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపిన ఐటెం గర్ల్.
తన అదంచందాలతో అప్పట్లో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ.వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ముందుకు కొనసాగించింది.
డిస్కోశాంతి పాట లేని సినిమాలు ఉండేవి కావు.అయితే అక్కినేని నాగేశ్వరరావు నటించి సినిమా కాలేజీ బుల్లోడు.
ఈ సినిమా 1992లో తెరకెక్కింది.ఇందులో డిస్కోశాంతి, అక్కినేని మధ్యన ఓ పాట ఉంటుంది.
ఈ పాట షూటింగ్ జరుగుతున్న టైంలో ఓ కాలేజీ కుర్రాడిని చితక బాదింది.
ఆ సీన్ చూస్తూ అక్కినేని సహా అక్కడున్న నటీనటులంతా అవాక్కయ్యారు.ఇంతకీ అతడిని శాంతి ఎందుకు కొట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్కినేని, డిస్కోశాంతి మధ్యన సాంగ్ షూట్ జరుగుతుంది.అంతలో అక్కడికి ఓ కుర్రాడు వచ్చి కెమెరా పక్కన నిలబడ్డాడు.
శాంతిని చూసి నవ్వాడు.దీంతో ఆమె అటువైపు తిరిగి చూసింది.
ఆ తర్వాత తను విత సైగలతో మితిమీరి ప్రవర్తించాడు.అభ్యంతరకరంగా చేతులు ఊపాడు.
రెండు మూడు గంటల పాటు ఆమె మౌనంగానే ఉంది.ఆ తర్వాత ఇంకాస్త తిక్క చేష్టలు చేయడం మొదలు పెట్టాడు.
ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది.ఆ కుర్రాడిని దగ్గరికి రమ్మని పిలిచింది.
అతడు దగ్గరికి రాగానే కాలితో ఒక్క తన్ను తన్నింది.కింద పడేసి పంచులు ఇచ్చింది.
అక్కడే ఉన్న అక్కినేని ఏం జరిగింతో తెలియదు కాబట్టి.మౌనంగా ఉండిపోయాడు.
కోపంతో బూతులు తిడుతూ విపరీతంగా తన్నింది.వెంటనే యూనిట్ మెంబర్స్ అక్కడికి చేరుకుని శాంతిని ఆపారు.
ఆ కుర్రాడు లేచి గోడదూకి పారిపోయాడు. """/"/
తర్వాత రోజు మళ్లీ పాట షూటింగ్ మొదలు కాబోతుంది.
ఈ సమయంలో అక్కినేని.శాంతిని పిలిచి నిన్న ఆకుర్రాడిని ఎందుకు కొట్టావు అని నెమ్మదిగా అడిగాడు.
దానికి శాంతి విషయం చెప్పింది.నిన్నంతా ఆ అబ్బాయి.
చూపులు, చేష్టలతో ఇబ్బంది పెట్టాడు అని చెప్పింది.అయినా అలా కొడితే ఆ అబ్బాయికి ఏమైనా అయితే నీకు ఇబ్బంది కదమ్మా అన్నాడు.
కానీ అతడి చేష్టలను చూసి విసుగు వచ్చిందని చెప్పింది.అందుకే కోపంలో అలా చేశానంది.
సరే అమ్మా.ఇకపై జాగ్రత్త అని చెప్పాడు అక్కినేని.
అయ్యబాబోయ్.. మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడ్లను చూసారా?