డిస్కో శాంతి తండ్రి పెద్ద హీరో.. ఆయన చనిపోవడంతో అందరూ ఒకే రూమ్‌లో..?

దివంగత నటుడు శ్రీహరి తన సతీమణి డిస్కో శాంతి( Disco Shanti ) గురించి ఎన్నో విషయాలను తెలియజేశాడు.

ఆమె జీవితం ఒక సినిమా స్టోరీలాగా మారిపోయింది అంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పాడు.

డిస్కో శాంతి 900కు పైగా సినిమాల్లో నటించి సంచలనం సృష్టించింది.ఆమె 1996లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ శ్రీహరిని పెళ్లి చేసుకుంది.

తరువాత సినిమాల్లో పనిచేయడం మానేసింది.తమిళనాడులో పుట్టిన ఈమె అసలు పేరు శాంతి కుమారి.

సినిమాల్లోకి వచ్చాక డిస్కో శాంతిగా పేరు మార్చుకుంది.ఈ ముద్దుగుమ్మ తండ్రి సి.

ఎల్.ఆనందన్( C L Anandan ) చాలా పెద్ద హీరో.

ఎంజీఆర్ తో పోటీపడేవాడు.30 ఏళ్ల కాలంలో 60 సినిమాల్లో నటించాడు.

హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగా కూడా నటించి మెప్పించాడు. """/" / దురదృష్టం కొద్దీ ఆయన 55 ఏళ్లకే చనిపోయాడు.

పిల్లలు అప్పటికే తమ కాళ్లపై తాము నిలబడే స్థాయికి రాలేదు.అయితే ఆయన మరణించిన తర్వాత ఆ తండ్రి బాధ్యతలను డిస్కో శాంతి భుజానికి ఎత్తుకుంది.

మొత్తంగా ఎనిమిది మందిని పోషించడానికి ఆమె ముఖానికి మేకప్ వేసుకుంది.అలా సినిమాల్లో పనిచేస్తున్న సమయంలోనే శ్రీహరితో ప్రేమలో పడింది.

కొన్ని రోజులకు శ్రీహరి ఆమె ఇంటికి వెళ్లి చూడగా అక్కడ పరిస్థితులు చూసి షాక్ అయ్యాడు.

ఆమె సంపాదనకు, ఇంట్లో పరిస్థితులకు అసలు ఎలాంటి పొంతన లేదని అనుకున్నాడు. """/" / ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ "డిస్కో శాంతి ఆనందన్‌కి పుట్టిన మూడో అమ్మాయి.

ఆమె మొత్తం ఎనిమిది మంది సోదరీ సోదరీమణులను పోషించింది.ఆనందన్‌ సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసేవారు.

ఆయన బాగానే సంపాదించారు కానీ ఆయన కింద ఉన్న మేనేజర్లు మోసం చేసి డబ్బులు అంతా దోచేశారు.

అందువల్ల వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉండేది.డిస్కో శాంతి తీసుకొచ్చిన సంపాదన అంతా కూడా కుటుంబాన్ని నడపడానికే సరిపోయేది.

ఆమె అంత సంపాదిస్తున్న కూడా కిందనే పడుకునేది.బ్రదర్స్, సిస్టర్స్ మ్యారేజ్ విషయంలో చాలా సహాయం చేసింది.

అలాంటి మంచి మనస్తత్వాన్ని చూశాక నాకు ఆమెపై ప్రేమ పెరిగింది.నేను పదిమంది మంచి గురించే ఆలోచిస్తాను.

శాంతి కూడా అలాంటి వ్యక్తే అని తెలిసిన తర్వాత ఆమె నాకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందనుకున్నాను.

తర్వాత పెళ్లి ప్రపోజల్ చేయడం, బాగా ఆస్తి సంపాదించాక ఆమెను మ్యారేజ్ చేసుకోవడం జరిగిపోయింది.

" అని అన్నాడు.

ముసలోడే కానీ మహానుభావుడు.. టిక్‌టాక్ లవర్ కోసం భార్యను వదిలేశాడు.. చివరకు?