విశ్వక్ లైలా సినిమాకు వైసీపీ సెగ… డిజాస్టర్ లైలా అంటూ ట్రెండింగ్!
TeluguStop.com
హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) నటించిన లైలా సినిమా( Laila Movie ) ప్రేమికుల దినోత్సవం అని పురస్కరించుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాకు మాత్రం వైసీపీ( YCP ) సెగ భారీగా తగులుతుందని చెప్పాలి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా కమెడియన్ పృథ్వీరాజ్( Comedian Pruthvi Raj ) మాట్లాడుతూ 150 గొర్రెలు కాస్త 11 గొర్రెలు అయ్యాయి అని మాట్లాడటంతో కచ్చితంగా ఈయన వైసీపీని ఉద్దేశించి చేశారని భావించిన అభిమానులు ఒక్కసారిగా బాయ్ కాట్ లైలా అంటూ ఒక హాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు.
"""/" /
ఇకపోతే ఈ సినిమా గురించి భారీ స్థాయిలో నెగిటివిటీ స్ప్రెడ్ కావడంతో విశ్వక్ సేన్ క్షమాపణలు కూడా చెప్పారు.
అయినప్పటికీ వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ తగ్గలేదు ఇక చివరకు కమెడియన్ పృథ్వీరాజ్ సైతం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేస్తూ అందరికీ క్షమాపణలు చెప్పారు.
ఇలా క్షమాపణలు చెప్పినప్పటికీ వైసీపీ కార్యకర్తలు మాత్రం వెనకడుగు వెయ్యలేదు.ఈ సినిమాని ఎలాగైనా అడ్డుకుంటాము అంటూ చాలెంజ్ చేశారు.
"""/" /
ఇకపోతే నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో కొంతమంది ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వగా మరికొందరు మాత్రం నెగటివ్ రివ్యూ ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి ఏకంగా డిజాస్టర్ లైలా( Disaster Laila ) అంటూ మరొక హష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
ఒక్కో అకౌంట్ నుంచి దాదాపు 100 ల ట్వీట్స్ చేస్తున్నారు.దీంతో లైలా సినిమా చిత్ర బృందం.
తీవ్ర ఆందోళనకు గురవుతోంది.క్షమాపణలు చెప్పిన కూడా వైసిపి నేతలు దిగిరావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసే వ్యాఖ్యలు నిర్మాతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారికి కోట్ల రూపాయల నష్టాన్ని కల్పిస్తున్నారు.