ఈ సినిమాలు ఎక్కడున్నాయో తీసిన వారికి కూడా తెలుసో? తెలియదో ?
TeluguStop.com
ఇప్పుడు సినిమా ఒకటి వస్తుంది అంటే చాలు జరిగే హడావిడి మామూలుగా ఉండడం లేదు.
సినిమా మొదలైనప్పటి నుంచి విడుదలయ్యే వరకు మీడియాలో ఫుల్ ఫామ్ లో ప్రమోషన్ చేస్తూ ఉంటారు.
దీనికి తోడు సోషల్ మీడియా ప్రమోషన్ కూడా తోడవుతుంది.అలా అన్ని విధాలుగా సినిమాను బాగా ప్రమోట్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు.
అయితే ఇంత చేసుకున్న తర్వాత సినిమా థియేటర్లో వచ్చింది అంటే హిట్టో, ఫట్టొ అయిపోతుంది.
ఆ తర్వాత సినిమా ఏమవుతుంది అనేది పెద్ద ప్రశ్న.ఇప్పుడైతే ఐ బొమ్మ లో వస్తున్నాయి , ఓటీటీ లో వస్తున్నాయి.
రకరకాల ప్లాట్ఫామ్స్ లో సినిమా ప్రమోట్ అవుతుంది.యూట్యూబ్ లో కూడా చివరికి సినిమాను విడుదల చేస్తున్నారు.
"""/" /
అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని సినిమాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో ఏమైపోయాయి కూడా ఎవరికి తెలిసినట్టు లేదు.
వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఎక్కడా కనిపించడం లేదు.చివరికి యూట్యూబ్లో కూడా ఆ సినిమాలు లేవు అంటే వాటి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
అలా ఎన్ని సినిమాలు ఉన్నాయో ఇప్పుడు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సిద్ధార్థ( Hero Siddharth ) హీరోగా నటించిన జబర్దస్త్( Jabardasth ) అనే సినిమా థియేటర్స్ లో అట్టర్ ప్లాప్ అయింది ఈ సినిమా యూట్యూబ్ లో ఎవరో బయట యూజర్ అప్లోడ్ చేశారు కానీ అఫీషియల్ గా ఎక్కడా లేదు.
ఈ సినిమాతో సిద్ధార్థ, సమంత ప్రేమలో కూడా పడ్డారు.ఇక కన్నడ హీరో ఉపేంద్ర నటించిన ఉపేంద్ర 2( Upendra 2 ) అనే సినిమా సంగతి కూడా ఎవరికి తెలియకుండా పోయింది.
"""/" /
ఈ సినిమా ఐ బొమ్మలో కూడా ఎక్కడా కనిపించలేదు.వీటితో పాటు సాయి ధరంతేజ్( Saidharam Tej ) నటించిన రేయ్ సినిమా( Rey Movie ) పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.
ఆ సినిమా ఏ ఓటీటీ లో, యూట్యూబ్ లో, చివరికి ఐ బొమ్మ లో కూడా ఎక్కడ లేదు.
2013లో శ్రీకాంత్ హీరోగా నాటుకోడి( Naatu Kodi Movie ) అనే సినిమా వచ్చింది.
ఈ సినిమా వచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియదు.ప్రస్తుతం అది ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలీదు.
ఇలా కొన్ని సినిమాలు ప్రేక్షకుల కంటపడకుండా అలా జస్ట్ డిసప్పియర్ అయిపోయాయి.
షాకింగ్: అడుక్కునే వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఎలా కొన్నాడో వినండి?