Junior NTR : ఆ ముగ్గురు డైరెక్టర్స్ మాట గుడ్డిగా నమ్మి మోసపోయిన తారక్
TeluguStop.com
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోగా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) అభిమానులను సంపాదించుకున్నాడు.
దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న తారక్ సినిమా ఎంపిక విషయంలో కథ కన్నా కూడా మనుషులకే ప్రాధాన్యత ఇస్తాడు.
ఒక మనిషిని గుడ్డిగా నమ్మితే వారి సినిమా ఎలా ఉన్నా చేయడానికి తారక్ ముందు ఉంటాడని ఈ టాలీవుడ్ లో అందరూ అనుకుంటారు.
ఇక ఆచార్య పరాజ్యాన్ని అందరూ కొరటాల శివ పై మోపిన శివ పై ఉన్న నమ్మకంతో తారక్ దేవర సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.మరి గతంలో ఇలాగే పప్పులో కాలేసి పరాజయాలు అందుకొనీ ఎలాంటి దర్శకుల చేతిలో మోసపోయారు అన్న విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నరసింహుడు
జూనియర్ ఎన్టీఆర్ బి.గోపాల్ ( B Gopal )కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నరసింహుడు.
ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.అసలు ఇలాంటి ఒక సినిమా కథను ఎలా ఎంచుకున్నాడు తారక్ అని అందరూ అనుకునేలా చేసింది చిత్రం.
బి.గోపాల్ పై ఉన్న నమ్మకంతోనే ఆయన అంతకు ముందు తీసిన సినిమాల రికార్డ్స్ దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చేసినట్టుగా తెలుస్తోంది అయితే గోపాల్ మాత్రం తారక్ కి హిట్ ఇవ్వలేకపోయారు.
H3 Class=subheader-styleశక్తి/h3p """/" /
టాలీవుడ్ చరిత్రలోనే ఈ చిత్రం అత్యంత డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని పూర్తి స్థాయిలో అశ్విని దత్ సంస్థని అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టను దిగజార్చింది.
శక్తి సినిమా దర్శకుడు మెహర్ రమేష్( Meher Ramesh ) బిల్లా సినిమా మినహా మెహర్ రమేష్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు పెద్ద హీరోలు అవకాశం ఇచ్చిన ప్రతిసారి అతడు పరాజయాలను ఇస్తూ వచ్చాడు అందుకు తారక్ సైతం అతీతం కాదు.
H3 Class=subheader-styleదమ్ము/h3p """/" /
సాధారణంగా బోయపాటి( Boyapati Srinu ) సినిమాలో హీరో యాక్షన్స్ సన్నివేశాలతో కుమ్మేస్తాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ అవకాశం ఇచ్చిన కూడా దమ్ము లాంటి ఒక పరాజయాన్ని ఇచ్చి అత్యంత చెత్త రికార్డు తారక్ మూటగట్టుకునేలా బోయపాటి చేశాడు.
అందుకే ఆ తర్వాత ఈ కాంబినేషన్ మళ్ళీ ఎక్కడ వర్కౌట్ కాలేదు.ఇలా పిలిచి అవకాశం ఇచ్చిన దర్శకులు అందరూ కూడా జూనియర్ కి మంచి సినిమాలు ఇవ్వలేకపోయారు.
ఇకపైన ఇలాంటి చిత్రాలు చేయకుండా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
దేవర మూవీ క్లోజింగ్ కలెక్షన్ల లెక్క ఇదే.. ఎన్టీఆర్ స్టామినాకు అసలు ప్రూఫ్స్ ఇవే!