Pawan Kalyan Puri Jagannath : పవన్ కల్యాణ్ పరిచయం చేసిన దర్శకులు వీళ్ళే !

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పవర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయనే ఒక పవర్ బూస్టర్.పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు యావత్ రెండు తెలుగు రాష్ట్రాలు నిద్ర కూడా పోరు.

ఇక పవన్ కళ్యాణ్ సైతం తన కెరీర్ లో ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేశారు.

వారి ద్వారా హిట్స్ కూడా అందుకున్నారు.అంతే కాదు తనని తాను కూడా దర్శకత్వం వహించుకున్నాడు .

మన పవర్ స్టార్ ద్వారా పరిచయమై అతనికి హిట్ ఇచ్చిన ఆ దర్శకులు ఎవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తొలిప్రేమ: పవన్ నువ్వు మొట్టమొదటిసారి హీరోగా అలాగే స్టార్ ని చేసింది ఈ చిత్రమే ఈ సినిమా ద్వారా యూత్ అంతా కూడా పవన్ కి అట్రాక్ట్ అయ్యారు.

1998, జూలై 24 న విడుదలైన తొలిప్రేమ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది అంతేకాదు ఈ సినిమాకి ఏ కరుణాకరన్ అనే కొత్త వ్యక్తిని దర్శకుడుగా పరిచయం చేశారు పవన్ కళ్యాణ్.

పవర్ స్టార్ ఇచ్చిన అవకాశాన్ని కరుణాకరన్ చక్కగా వినియోగించుకున్నాడు. """/" / తమ్ముడు :( Thammudu ) పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం.

తన జీవితంలో కరాటే తో పాటు బాక్సింగ్ లో కూడా శిక్షణ పొందాడు అలాగే కొన్ని అవార్డులు సైతం అందుకున్నాడు.

అయితే బాక్సింగ్ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం విశేషం.1995, జూలై 15 న వచ్చిన ఈ సినిమా సైతం పవన్ కళ్యాణ్ కెరియర్ లో మర్చిపోలేని విజయాన్ని అందించింది.

పి ఎ అరుణ్ ప్రసాద్ కెప్టెన్ ( P.A.

Arun Prasad )ని ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం చేశారు పవన్ కళ్యాణ్.

"""/" / బద్రి : ( Badri )ఇక స్టైల్ కి మారుపేరుగా ఆ పవన్ కళ్యాణ్ మారిన సినిమా బద్రి.

ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ ని ఇప్పటికి యూత్ ఫాలో అవుతూ ఉంటారు.

ఈ సినిమా ద్వారా డేరింగ్ మరియు డాషింగ్ దర్శకుడు అయినటువంటి పూరి జగన్నాథ్( Puri Jagannath ) ని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.

ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయింది.

ఆ సినిమాతో నా గొయ్యి నేనే తవ్వుకున్నా.. చేయకుండా ఉండాల్సిందే: శ్రీను వైట్ల