పిట్టలు రెట్టలు అంటూ ట్విట్టర్ రివ్యూ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?

రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు డైరెక్టర్ శరత్ మండవ.

ఈ సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ శరత్ ఓ మీడియా సమావేశంలో రివ్యూల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ యుఎస్లో ప్రీమియర్ షోలు పడడమే ఆలస్యం వెంటనే ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇవ్వడం మొదలు పెడతారు అంటూ కామెంట్స్ చేశారు.

సినిమా విడుదలైన వెంటనే ట్విట్టర్ రివ్యూలు, ఫీడ్ బ్యాక్ విషయంలో ఈయన అసహనం వ్యక్తం చేశారు.

ఇలా ట్విట్టర్ రివ్యూ చూసి సినిమాలకు మాత్రం వెళ్లొద్దని ఈయన ప్రేక్షకులను కోరారు.

పిట్టలు రెట్టలు వేస్తుంటాయనీ, అందులో ఏ విధమైనటువంటి మంచి ఉండదని సినిమాల విషయంలో కూడా కొందరు ఉద్దేశపూర్వకంగానే నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్వీట్లు చేస్తుంటారని ఈయన ఆరోపించారు.

ట్విట్టర్ రివ్యూ చూసి ఒక సినిమా విజయ అపజయాలను అంచనా వేయకండనీ ఈయన తెలిపారు.

సినిమా విడుదలైన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు వేచి ఉండాలని అప్పుడే ఆ సినిమా ఫలితం ఏంటో పూర్తిగా తెలిసిపోతుందని శరత్ పేర్కొన్నారు.

సినిమా బాగాలేదు అంటే చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదని కానీ ట్విట్టర్ రివ్యూని చూసి సినిమాని మాత్రం అంచనా వేయకండి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త!