Sunil Trivikram : నీకే దిక్కులేదు త్రివిక్రమ్ గురించి ఎందుకంటూ సునీల్ కు అవమానాలు.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) అలాగే హీరో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒకే రూమ్ లోనే ఉండేవారట.
అంతేకాకుండా సినిమా అవకాశాల కోసం ఇద్దరూ ఎన్నో రకాల అవస్థలను పడినట్లు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు సునీల్, త్రివిక్రమ్.
ఆ సమయంలోనే సునీల్ ఉదయం లేవగానే ఫోటోలు పట్టుకొని స్టూడియోలో ముందు తిరిగే వారట.
అలా తిరిగేటప్పుడు తన గురించి కాకుండా తన ఫ్రెండ్ త్రివిక్రమ్ గురించి డైరెక్టర్లకు నిర్మాతలకు చెప్పేవారట.
"""/" /
ఆ సమయంలో దర్శకనిర్మాతలు నీకే దిక్కులేదు.త్రివిక్రమ్ గురించి నీకు ఎందుకు.
అసలు నువ్వు అవకాశాల కోసం వచ్చావా లేక నువ్వు మాకు అవకాశాలు ఇవ్వడానికి వచ్చావా అని దారుణంగా అవమానించారట.
అయితే సరిగ్గా అలా అవమానించిన రెండు సంవత్సరాల తర్వాత అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం చాలామంది ఆయన ఇంటి దగ్గర ఎంతగానో ఎదురు చూశారట.
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎప్పుడు బయటకు వస్తారా అని ఎంతోమంది ఆయన కోసం ఇంటి దగ్గర ఎదురు చూసేవారు అని చెప్పుకొచ్చారు సునీల్.
"""/" /
ఇకపోతే సునీల్ ( Sunil )విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో సునీల్ విలన్ పాత్రలలో కూడా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
2021 లో విడుదల అయినా పుష్ప 1 సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు సునీల్.
విలన్ గా చాలా అద్భుతంగా నటించాడు.అందుకుగాను మంచి మార్కులే పడ్డాయి.
మరోవైపు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో కలిసి గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )ను తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.