దర్శకులు తీసేయాలనుకున్న కూడా ఆ హీరోయిన్స్ నీ సినిమా నుంచి తప్పించలేక పోయారట !

సినిమా ఇండస్ట్రీకి ఎవరు ఎప్పుడు ఎలా వచ్చి చేరుతారో చెప్పడం కష్టం.కొంతమంది కి కొన్నిసార్లు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది.

అలాగే మరికొంత మందికి ఎంత ట్యాలెంట్ ఉన్న ఎక్కడో దురదృష్టం కొడుతూనే ఉంటుంది.

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకోబోయే కొంత మంది హీరోయిన్స్ కి అదృష్టం గట్టిగానే పట్టింది.

అందుకే కొందరు దర్శకులు సదరు హీరోయిన్స్ నీ తమ సినిమా నుంచి తీసేయాలనుకున్నప్పటికి అది కుదరలేదు.

పైగా ఆ అవకాశం తర్వాత ఆ హీరోయిన్స్ ఇండస్ట్రీ లో పాతుకుపోయారు.అలా నక్క తొక తొక్కిన కొంత మంది హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

H3 Class=subheader-styleఅనుష్క శెట్టి/h3p """/" / పూరీ జగన్నాథ్ అనుష్క శెట్టి ( Anushka Shetty )నీ సూపర్ సినిమా కోసం తీసుకున్నారు.

ఆమెకు అది మొదటి సినిమా.పైగా నటనలో ఓనమాలు కూడా తెలియదు.

అందుకే ఒక 3 రోజుల పాటు ఆమె ఎలా నటిస్తుందో చూసి ఆ తర్వాత బాగ లేకపోతే సినిమా నుంచి తీసేయచ్చు అనుకున్నాడట.

కానీ ఈ రోజు ఆమె ఏ స్థాయిలో ఉందో మన అందరికీ తెలిసిందే.

H3 Class=subheader-styleశృతి హాసన్/h3p గబ్బర్ సింగ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా శృతి హాస( Shruti Haasan )న్ నీ తీసుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్.

కానీ ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే నాటికి ఆమెకు వరస పరాజయాలు ఉన్నాయి.

దాంతో హరీష్ ఆమెను తీసేసి మరో హీరోయిన్ ను తీసుకుందాం అని అన్నారట.

కానీ పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పుకోలేదు.ముందు మాట ఇచ్చాం కాబట్టి ఎలా ఉన్న పర్లేదు శృతినే కంటిన్యూ చేయమని చెప్పారట.

దాంతో గబ్బర్ సింగ్ సినిమాతో ఆమె దశ తిరిగింది.h3 Class=subheader-styleసమంత/h3p """/" / రంగస్థలం సినిమా కోసం సమంత( Samantha ) ను రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా తీసుకున్నారు.

కానీ ఒక విలేజ్ గర్ల్ పాత్రలో సమంత ఎలా నటిస్తుందో అనే అనుమానం సుకుమార్ కి ఉండేదట.

పైగా అప్పుడే నాగ చైతన్య తో సమంత కి వివాహం కూడా జరిగింది.

ఒక మాస్ విలేజ్ గర్ల్ పాత్ర ఆమెకు సెట్ అవ్వదు అని అనుకొని ఒక వారం అయితే షూట్ చేసి ఒక వేళ సెట్ అవ్వకపోతే అప్పుడు హీరోయిన్ నీ మార్చచ్చు అనుకున్నారట.

కానీ సమంత తప్ప ఆ పాత్ర లో మరొక హీరోయిన్ నీ ఊహించుకోలేని విధంగా ఆమె నటించింది.

ధనుష్ రాయన్ సినిమా ట్రైలర్ పరిస్థితి ఏంటి..?