విడుదల తర్వాత మాట్లాడండి.. ట్రైలర్‌ చూసి ట్రోల్స్ చేయవద్దు ప్లీజ్‌

ఉత్తరాది ప్రేక్షకులు ది ఫ్యామిలీ మ్యాన్‌ మొదటి సీజన్ ను సూపర్‌ హిట్ చేశారు.

దాంతో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తెరకెక్కింది.ఈసారి ఈ వెబ్‌ సిరీస్ కోసం హిందీ ఆడియన్స్ తో పాటు తెలుగు మరియు తమిళ ఇతర సౌత్‌ భాషల ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

ఈ వెబ్‌ సిరీస్ లో సమంత కీలక పాత్రలో నటించడమే అందుకు కారణం.

గత ఫిబ్రవరిలో ఈ వెబ్‌ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసినా కూడా ఆ సమయంలో సాధ్యం కాలేదు.

ఎట్టకేలకు ఈ వెబ్‌ సిరీస్ ను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు.అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ వెబ్‌ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయడం జరిగింది.

ట్రైలర్‌ విడుదల చేసినప్పటి నుండి తమిళనాడుకు చెందిన కొందరు విమర్శలు మొదలు పెట్టారు.

ఖచ్చితంగా వెబ్‌ సిరీస్ ను అడ్డుకుని తీరుతామని అంటున్నారు.తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా వెబ్‌ సిరీస్ ఉండబోతుందని వారు ఆరోపిస్తున్నారు.

దాంతో తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ వెబ్‌ సిరీస్ పై ఆంక్షలు విధిస్తున్నట్లుగా ప్రకటించింది.

దాంతో దర్శకుల ద్వయం మరో సారి ఈ సినిమా గురించి వివరించే ప్రయత్నం చేశారు.

తమిళ ఆడియన్స్‌ రెండు డైలాగ్‌ లను చూసి విమర్శిస్తున్నారు.వెబ్‌ సిరీస్‌ మొత్తం చూస్తే ఖచ్చితంగా మీకే నచ్చుతుంది.

తప్పకుండా ప్రతి ఒక్కరి మనోభావాలు గౌరవించే మేము ఈ వెబ్‌ సిరీస్ ను తెరకెక్కించాం.

మేము పని చేసిన టీమ్‌ లో చాలా మంది తమిళ టెక్నీషియన్స్ ఉన్నారు.

వారందరు కూడా అన్ని విధాలుగా పరిశీలించి, పరీక్షించిన తర్వాతే స్క్రిప్ట్ ను ముందుకు తీసుకు వెళ్లాం.

దీనిలో ఏమైనా తేడా ఉంటే ఖచ్చితంగా వారు అడ్డుకునే వారు కదా.అందుకే వెబ్‌ సిరీస్ ను చూసిన తర్వాత అప్పుడు విమర్శలు చేయాలంటూ దర్శకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరి ఈ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్‌ కు అడ్డు తొలగేనా చూడాలి.

భారీ ధరలకు చైతన్య తండేల్ డిజిటల్ రైట్స్ కైవసం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!