కొడాలి నాని పై డైరెక్టర్ వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
డైరెక్టర్ వివి వినాయక్ అందరికీ సుపరిచితుడే."ఆది" సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన వినాయక్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.
మాస్ ప్రేక్షకులను అలరించే రీతిలో సినిమాలు చేయటంలో వినాయక్ స్టైలే వేరు.ఆది, ఠాగూర్, ఖైదీ నెంబర్ 150, అదుర్స్.
ఇంకా చాలా భారీ బాక్ బస్టర్ సినిమాలు వినాయక్ తీయడం జరిగింది.ఇదిలా ఉంటే ప్రతి సంక్రాంతి పండుగకు గుడివాడలో స్థానిక ఎమ్మెల్యే మాజీమంత్రి కొడాలి నాని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని సంగతి తెలిసిందే.
జాతీయస్థాయిలో ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తూ ఉంటారు.ఈ కార్యక్రమానికి ప్రతి ఏడాది ఓ ప్రత్యేకమైన అతిధీనీ కొడాలి నాని తీసుకొస్తూ ఉంటారు.
గత ఏడాది బైరెడ్డి సిద్దార్ధరెడ్డి రావడం జరిగింది.కాగా ఈ ఏడాది డైరెక్టర్ వివి వినాయక్ రావటం జరిగింది.
ఈ సందర్భంగా వినాయక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు."సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది.
కొడాలి నాని ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చా.ఆయన వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్న.
ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం.ఆయన ఎప్పుడంటే అప్పుడు మళ్లీ ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు వివి వినాయక్ ఈ సందర్భంగా తెలియజేశారు.