డిజే టిల్లు 2 డైరక్టర్ బయటకు వచ్చేశాడా..!
TeluguStop.com
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న సినిమా డీజే టిల్లు.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అతనే స్క్రిప్ట్ రాసిన డీజే టిల్లు సినిమాని విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు.
ఈ సినిమా సక్సెస్ లో సిద్ధు పాత్ర ఎక్కువ ఉందని చెప్పొచ్చు.సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ మూవీకి సీక్వల్ ని కూడా ప్లాన్ చేశారు చిత్రయూనిట్.
సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో డీజే టిల్లు 2 రాబోతుంది.ఈ సినిమా ఆగష్టు నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
అయితే అనూహ్యంగా డీజే టిల్లు 2 నుంచి డైరక్టర్ విమల్ కృష్ణ తప్పుకుంటున్నట్టు టాక్.
డీజే టిల్లు సూపర్ హిట్ అవడంతో అతని పాత్ర కూడా ఉంటుంది.మరి అలాంటిది అతను ఎందుకు ఈ సీక్వల్ కి డైరక్షన్ చేయట్లేదు అంటే.
చిత్రయూనిట్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అది జరుగుతుందని అంటున్నారు.సినిమా హీరో సిద్ధు జొన్నలగడ్డనే డీజే టిల్లు 2కి కథ ఇస్తున్నారట.
అయితే డైరక్టర్ కి హీరోకి మధ్య చిన్న గొడవ మొదలైందట.అదే డైరక్టర్ ని బయటకు వచ్చేలా చేసిందని అంటున్నారు.
సిద్ధుతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే డైరక్టర్ విమల్ కృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది.
"""/"/
అయితే డైరక్టర్ లేని ఇంప్యాక్ట్ సినిమా మీద ఎంత మేరకు పడుతుంది అన్నది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా సూపర్ హిట్ సినిమా సీక్వల్ కి మొదటి సినిమా డైరక్టర్ ఉంటేనే ఆ జోష్ ఉంటుంది.
ఒకవేళ క్రియేటివ్ గొడవలు ఉన్నా అది సినిమా అవుట్ పుట్ మీద దెబ్బ పడేలా కాకుండా ఉంటే బాగుండేది.
మొత్తానికి డీజే టిల్లు 2 నుంచి వచ్చిన ఈ కొత్త అప్డేట్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది.
ఇక ప్రస్తుతం డీజే టిల్లు 2 ని సిద్ధు తన వంటి చేత్తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.