పాపం.. ఆ స్టార్ డైరెక్టర్ ను వాళ్ళు నమ్మించి మోసం చేశారట!

పాపం ఆ స్టార్ డైరెక్టర్ ను వాళ్ళు నమ్మించి మోసం చేశారట!

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వెంకీ కుడుముల వరస హిట్లతో దూసుకుపోతున్నాడు.

పాపం ఆ స్టార్ డైరెక్టర్ ను వాళ్ళు నమ్మించి మోసం చేశారట!

మొదటి సినిమాతోనే హిట్ కొట్టి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు.రెండవ సినిమా బీష్మ కూడా హిట్ అవ్వడంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

పాపం ఆ స్టార్ డైరెక్టర్ ను వాళ్ళు నమ్మించి మోసం చేశారట!

అయితే తాజాగా ఈ డైరెక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడని తెలుస్తుంది.ఈ మధ్య సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు.

పోలీసులు ఎంత హెచ్చరించిన ప్రజలు ఏదో ఒక విధంగా మోసపోతూనే ఉన్నారు.చదువుకున్న వాళ్ళు కూడా ఈ మోసగాళ్ల చేతికి చిక్కుతున్నారు.

తాజాగా వెంకీ కుడుమల కూడా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి భారీగా డబ్బును సమర్పించుకున్నాడని తెలుస్తుంది.

కొంత డబ్బు ఇచ్చిన తర్వాత తాను మోసపోయానని గ్రహించిన వెంకీ పోలీసులకు ఫిర్యాదు చేసాడట.

"""/"/ వెంకీ కుడుములకు ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చిందట అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్ సభ్యుడిగా పరిచయం చేసుకున్న అతడు భీష్మా సినిమా నామినేట్ అయ్యిందని ఒక్కో కేటగిరీకి 11 వేళా చొప్పున చెల్లించాల్సి ఉంటుందని నమ్మించాడు.

ఈ విషయాన్ని నిజమే అని నమ్మి వెంకీ కుడుముల మొత్తం ఆరు కేటగిరీలకు కలిపి 66 వేల రూపాయలు చెల్లించాడు.

మరికొద్ది రోజులకు ఆ నేరగాడు వెంకీ కుడుములకు మళ్ళీ ఫోన్ చేసి మరికొంత డబ్బు చెల్లించాలని చెప్పడంతో అనుమానం వచ్చి ఆ విషయం గురించి ఆరా తీయగా అది ఫేక్ కాల్ అని తెలిసి తాను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని అకౌంట్ నెంబర్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు పదే పదే హెచ్చరించినా ప్రజలు మాత్రం వాళ్ళ మాయలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

ఇప్పటికీ పోలీసులు తొందర పడి ఎవ్వరికి డబ్బులు పంపవద్దని చెబుతున్నారు.

దారుణం.. టెల్సా కారుతో ముగ్గురిని చంపేసి, జోకులేసిన యువకుడు..