'మొదటిది ఎప్పటికి మర్చిపోలేము'.. ఎమోషనల్ అయిన వెంకీ కుడుముల!

వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా నటించిన సినిమా ఛలో.ఈ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాగ శౌర్య.

వెంకీ కుడుములకు కూడా ఇది మొదటి సినిమా.అంతేకాదు ఈ సినిమాతోనే రష్మిక మందన్న తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమా వల్ల వెంకీ కుడుముల టాలీవుడ్ లో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ రోజుకి ఛలో సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి అయ్యింది.

ఈ సందర్భంగా వెంకీ కుడుముల సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

మొదటిది ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు వెంకీ కుడుముల.

ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి షేర్ చేస్తూ ఈ జర్నీ విజయవంతం అవడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ అని తెలిపారు.

ఈ సినిమా ఎప్పటికి మర్చిపోలేనిది అంటూ చెప్పుకొచ్చాడు వెంకీ.ఈ సినిమా నాగ శౌర్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచి పోయింది.

రష్మిక కూడా ఈ సినిమాతోనే మొదటి హిట్ కొట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

"""/"/ ఛలో సినిమా తర్వాత వెంకీ కుడుముల నితిన్ తో భీష్మ సినిమా చేసి మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఈ రోజు ఛలో సినిమా విడుదల అయ్యి 4 ఏళ్ళు అయిన సందర్భంగా వెంకీ కుడుముల ట్వీట్ చేసారు.

"""/"/ ప్రస్తుతం వెంకీ కుడుముల చిరంజీవి తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

చిరు ప్రెసెంట్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ వెంకీ కుడుముల సినిమాను స్టార్ట్ చేయనున్నారు.

ఈ పనుల తోనే వెంకీ ప్రెసెంట్ బిజీగా ఉన్నాడు.

పెళ్లి కూతురుగా ముస్తాబయి డాన్స్ ఇరగదీసిన శోభిత.. వీడియో వైరల్!