వెంకటేష్ తో సినిమాకి రెఢీ అయిన స్టార్ డైరెక్టర్…

హీరోలు వాళ్ల కంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటు ముందుకు వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇక అందరి విషయం పక్కన పెడితే తెలుగు లో ఉన్న కొంతమంది స్టార్ హీరోల్లో వెంకటేష్( Venkatesh ) ఒకరు.

ఈయన హీరోగా నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని సాధించాయి.

దాంతో పాటుగా ఈయన ఏదైనా సినిమా చేశాడు అంటే ఆ సినిమా మినిమమ్ ఆవరేజ్ సినిమాగా ఆడుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు అందుకనే ఆయన చేసిన సినిమాలకి ప్రేక్షకుల్లో ఆదరణ అలా ఉంటుంది.

వెంకటేష్ ని ప్రొడ్యూసర్స్ హీరో అని కూడా పిలుస్తు ఉంటారు. """/" / ఇక ప్రస్తుతం వెంకటేష్ శైలేష్ కొలను డైరెక్షన్ లో సైంధవ్( Saindhav ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.

ఇక ఇప్పుడు వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి.

దానికి తగ్గట్టుగానే జాతి రత్నాలు డైరెక్టర్ అయిన అనుదీప్( Anudeep ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతుండగా,ఇక తరుణ్ భాస్కర్( Tarun Bhaskar ) డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక వీళ్ళిద్దరితోపాటు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో( Vamsi Paidipally ) కూడా వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలయితే వస్తున్నాయి.

"""/" / రీసెంట్ గా వంశీ పైడిపల్లి తమిళ్ విజయ్ తో వారసుడు అనే సినిమా చేసి ఫ్లాప్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.

అందుకే ఇప్పుడు మళ్లీ తెలుగు హీరో తో ఒక సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

దాంట్లో భాగంగానే వెంకటేష్ తో ఒక ఫ్యామిలీ డ్రామా సినిమాని తెరకెక్కించబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఆ స్టోరీ కి సంభందించిన కథ చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.వెంకటేష్ కూడా ఈ మధ్య కంప్లీట్ ఫ్యామిలీ సినిమాలు చేసి చాలా రోజులు అవుతున్న నేపథ్యం లో వెంకటేష్ కూడా ఈ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది.

మహేష్ జక్కన్న మూవీ ముహూర్తం ఫిక్స్.. ఆరోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే!