హీరోయిన్ ను అడ్డు పెట్టుకుని బన్నీపై సెటైర్లు వేసిన ప్రముఖ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?

అల్లు అర్జున్( Allu Arjun ) సంధ్య థియేటర్ ఘటన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారం ఎంతటి దుమారాన్ని రేపిందో మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ అరెస్ట్ అవడం కోర్టుకు వెళ్లడం ఆ తర్వాత బెయిల్ పై బయటికి రావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి.

చిన్న విషయం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారింది.ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను నిర్వహించగా అందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పేరు మర్చిపోవడంతో కారణంగా ట్రోలింగ్స్ కూడా జరిగాయి.

దాదాపు ఒక 10 నుంచి 15 రోజులపాటు ఈ వ్యవహారం టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం చెప్పాలి.

ఆ తరువాత అల్లు అర్జున్ కు బెయిల్ రావడం, సినిమా వాళ్లు సీఎం ను కలవడం ఇలా చిన్నగా సర్ధుమణుగుతున్న టైమ్ లో ఒక టాలీవుడ్ డైరెక్టర్ ఈ విషయంలో అల్లు అర్జున్ పై సెటైర్లు వేసే విధంగా సినిమా ఫంక్షన్ లో మాట్లాడారు.

"""/" / అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి పేరును బన్నీ ఎలా మర్చిపోయాడో తన సినిమా ఫంక్షన్ లో కూడా హీరోయిన్ రీతువర్మ( Heroine Ritu Varma ) పేరు మర్చిపోయినట్టుగా నటిస్తూ ఐకాన్ స్టార్ ను అవమానించేలా ప్రవర్తించాడు.

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు త్రినాథ్ రావు నక్కిన.( Trinadha Rao Nakkina ) అవును సినిమా చూపిస్త మావా, నేను లోకల్, ధమాకా లాంటి మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేసిన ఈ దర్శఖుడు తాజాగా సందీప్ కిషన్( Sundeep Kishan ) హీరోగా మజాకా సినిమాను( Mazaka Movie ) తెరకెక్కించాడు.

ఈ సినిమాలో మన్మధుడు హీరోయిన్ అన్షుతో పాటు రీతు వర్మ ఇద్దరు నటించారు.

అయితే ఈ సినిమాకు సబంధించి తాజాగా ఒక ఈవెంట్ జరిగింది.ఈ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడిన మాటలు అందరికి ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి.

"""/" / హీరోయిన్ అన్షు పై( Heroine Anshu ) కూడా త్రినాథ్ రావు నక్కిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

ప్రస్తుతం ఈ ఇష్యు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇన్ని సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్ అయ్యి ఉండి, ఇలా చిల్లరగా మాట్లాడటం ఏంటీ అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు, బన్నీని ఇమిటేట్ చేయడం లాంటివి చేయడంతో మరోసారి టాలీవుడ్ లో మరో వివాదం చెలరేగే అవకాశం కూడా కనిపిస్తోంది.

అల్లు అర్జున్ ఇష్యు చాలా సెన్సిబుల్.ఈ వివాదాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు అల్లు అరవింద్.

అటువంటిదాన్ని మళ్శీ కదిలించి విమర్శలు ఫేస్ చేస్తున్నాడు త్రినాథ్ రావు.ఇక ఈ విషయం ఎంత వరకూ వెళ్తుందా అని ఆలోచనలో పడ్డారు ఆడియన్స్.

బన్నీ ఫ్యాన్స్ నుంచి ఈ దర్శకుడిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.మరి ఈ విషయం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి మరి.

గుర్తు పట్టనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటీ?