అలాంటి గాసిప్స్ వింటే నవ్వుకుంటానంటున్న డైరెక్టర్ !

టాలీవుడ్ లో సినిమా చూపిస్తా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే వంటి హిట్ సినిమాలను తెరకెక్కించాడు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన.

అయితే ఈయనపై ఎప్పటి నుండో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.వాటిపై తాజాగా ఒక ఇంటర్వ్యూ లో త్రినాథరావు నక్కిన స్పదించారు.

ఈ డైరెక్టర్ ఎప్పటి నుండో వెంకటేష్, రవితేజ లతో సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఈ డైరెక్టర్ ఈ ఇద్దరి హీరోలతో సినిమాలు చేయడానికి స్క్రిప్ట్ కూడా రెడీ చేయించాడని అయితే ఈ ఇద్దరు హీరోలు తమ తమ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలను కొంతకాలం పక్కన పెట్టినట్టు వార్తలు వినిపించాయి.

ఈ మధ్యనే త్రినాథరావు నక్కిన రవితేజ తో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.

అయితే రవితేజ తో చేసే సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. """/"/ ఈ నేపథ్యంలో త్రినాథరావు నక్కిన ఈ విషయాలపై తన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో స్పందించారు.

రవితేజ తో తప్పకుండ సినిమా ఉంటుందని తెలిపారు.అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని కూడా చెప్పారు.

రవితేజ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీగా ఉందని షూటింగ్ కు కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నామని ఆయన తెలిపారు.

ఈ సినిమా హిల్లేరియస్ కామెడీ మూవీగా ఉండబోతుందని కూడా తెలిపాడు. """/"/ అంతేకాదు వెంకటేష్ తో చేసే సినిమా పై కూడా స్పందించాడు.

ఈయన సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా ఫైనల్ స్టేజ్ కు వచ్చిందని తెలిపాడు.

క్లైమాక్స్ విషయంలోనే ఇంకా చర్చలు జరుగుతున్నాయట.ఈ రెండు సినిమాలను విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభట్ల పీపుల్ మీడియా బ్యానర్ పై నిర్మించ బోతున్నారని ఆయన వెల్లడించారు.

ఆయన సినిమాలు ఆగిపోయాయని వస్తున్న రూమర్స్ వింటే నవ్వు వస్తుందని ఆయన తెలిపాడు.

380 అడుగుల జలపాతం అంచున సాహసం.. జారిందో బాడీ కూడా దొరకదు..?