Director Teja: ఎవరితోనైనా లేచిపో నచ్చకపోతే విడాకులిచ్చేయ్.. కూతురికి సలహాలిచ్చిన డైరెక్టర్ తేజ?
TeluguStop.com
మామూలుగా ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతగా పెంచుతూ ఉంటారు.అంతేకానీ గాలికి అసలు వదిలేయరు.
పైగా బయట ఎలా ఉండాలో.ఇలా ప్రవర్తించాలో అనేది కూడా నేర్పిస్తూ ఉంటారు.
అలా పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కటి తల్లిదండ్రుల ఆధ్వర్యంలోనే జరుగుతాయి.ముఖ్యంగా పెళ్లి అనేది తల్లితండ్రులు చెప్పిన వారినే చేసుకోవాలి.
కానీ ఈ మధ్య చాలామంది ప్రేమ పెళ్లిలు( Love Marriages ) అంటూ తమ సంతోష కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసుకుంటున్నారు.
ఇక మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం వాళ్ళు ఏది అడిగినా కూడా చేస్తున్నారు.
అందులో డైరెక్టర్ తేజ( Director Teja ) ఒకరు అని చెప్పాలి.కానీ తేజ ఫ్రీడమ్ విషయంలో మరి ఎక్కువగా ఉండడని చెప్పాలి.
ఏకంగా తన కూతురిని ( Director Teja Daughter ) లేచిపోయి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు తేజ గురించి అందరికీ తెలిసిందే.
నిర్మాతగా, ఛాయాగ్రాహకుడు, రచయితగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దర్శకుడుగా మారి మంచి పేరు సంపాదించుకున్నాడు.
తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళ భాషలో దర్శకుడిగా, ఛాయాగ్రాహకుడిగా ఎన్నో సినిమాలలో చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు.
"""/" /
ఈయన 1989లో శివ సినిమాలో తొలిసారిగా ఛాయాగ్రహణం అందించి మంచి గుర్తింపు పొందారు.
ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్ లతో ఛాయాగ్రహణం అందిస్తూ తొలిసారిగా 2000 సంవత్సరంలో తెరకెక్కిన నువ్వు నేను, జయం సినిమాలతో దర్శకత్వం వహించాడు.
ఇక ఈ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఆ తర్వాత వరుసగా పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
అయితే గత కొంతకాలం నుండి తేజకు అస్సలు కలిసి రావడం లేదు.చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి.
ఏ హీరో కూడా ఈయనతో సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు.ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు తేజ.
అయితే ప్రస్తుతం ఆయన దగ్గుబాటి అభిరామ్ తో అహింస( Ahimsa Movie ) అనే సినిమాను రూపొందిస్తున్నాడు.
"""/" /
ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ తొలిసారిగా హీరోగా పరిచయం కానున్నాడు.
ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నాడు.ఇక రిపోర్టర్ మీ కొడుకు ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు కదా.
కొన్ని రోజుల నుండి ఇదే వార్త ప్రచారం అవుతుంది అని ప్రశ్నించాడు.దాంతో తేజ స్పందిస్తూ.
తన కొడుకు డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడని.త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు అని అన్నాడు.
"""/" /
ఇక తన కూతురు గురించి కూడా మాట్లాడుతూ.తన కూతురు కూడా ఈ మధ్యనే విదేశాలలో చదువు పూర్తి చేసిందని.
ఇక తన కూతురికి తన ఒకే ఒక మాట చెప్పాను అంటూ.నేను నీకు పెళ్లి చేయను.
నీకు నచ్చిన వాడిని నువ్వే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో.ఆ తర్వాత భోజనాలు పెడదాం.
పెళ్ళయ్యాక భర్త నచ్చలేదా విడాకులు ఇచ్చేసేయ్.మనం సంతోషంగా బ్రతకడమే ముఖ్యం .
జనాలు ఏమనుకుంటారో మనకు అనవసరం అని తన కూతురుతో అన్నానని తెలిపాడు తేజ.
దీంతో ఆయన తన కూతురు గురించి ఈ విధంగా అనటంతో ఇటువంటి సలహాలు ఇచ్చే తండ్రులు కూడా ఉంటారా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు.
పైసా ఖర్చు లేకుండా స్కిన్ పిగ్మెంటేషన్ ను వదిలించుకోవడం ఎలాగో తెలుసా?