తెలుగు హీరోలకు విశ్వాసం లేదన్న డైరెక్టర్ తేజ!

ప్రస్తుతం భారత్ లో అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ బాలీవుడ్ కాదు టాలీవుడ్ అని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ నేపథ్యంలోనే గతంలో టాలీవుడ్ టాప్ దర్శకుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.

అతను చేసిన వ్యాఖ్యలు తెలుగు హీరోలను తక్కువ చేసినట్టు ఉన్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అసలు డైరెక్టర్ తేజ ఏం అన్నాడు? ఎప్పుడు అన్నాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అగ్రహీరోలు అంటూ విర్రవీగే తెలుగు హీరోలు అందరూ వేస్ట్.ఏ ఒక్కరికి కూడా టాలెంట్ లేదు.

చంటి, స్వాతిముత్యం వంటి సినిమాల్లో ఇప్పుడు ఎవరు నటించగలరు.ఆ స్థాయిలో నటన ఎవరు చేస్తారు చెప్పండి అంటూ డైరెక్టర్ తేజ ఫైర్ అయ్యారు.

అంతేకాదు.ప్రస్తుత హీరోలకు కొత్త సబ్జెక్ట్ ఎక్కదు.

ఎంత ఉన్న కామెడీ కామెడీ అంటూ గొర్రెల్లా వెళ్లిపోతున్నారు అంటూ తేజ చెప్పుకొచ్చారు.

తెలుగు హీరోలకు కృతజ్ఞత భావం కూడా లేదని చెప్పిన తేజ కొందరు హీరోలకు లైఫ్ ఇచ్చినట్టు అయినా వాళ్ళు నా ఆడియో ఫంక్షన్ ఉందంటే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యరని డైరెక్టర్ తేజ చెప్పుకొచ్చాడు.

అదే బాలీవుడ్ హీరోలు అయితే లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ల వద్ద ఎంతో కృతజ్ఞత భావంతో ఉంటారని అన్నారు.

సల్మాన్ ఖాన్ వంటి కండల వీరుడే మొదటి డైరెక్టర్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఏదైనా సినిమా చేసేటపుడు సల్మాన్ ఖాన్ కు సూరజ్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళిపోత అని కూడా కండిషన్ పెడతారని అదే హిందీ హీరోలకు తెలుగు హీరోలకు తేడా అని ఓ వీడియోలో అయన చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో మీరు ఓసారి చూడండి.

టీ గ్లాస్ పట్టుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్.. ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారా అంటూ?