Director Teja : నన్ను అవమానించిన వ్యక్తి నా ఇంటికి సహాయం కోసం వచ్చాడు : తేజ

డైరెక్టర్ తేజ( Director Teja ) సినిమా ఇండస్ట్రీకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

మద్రాస్ లో సినిమా పరిశ్రమ ఉన్న రోజుల్లోనే ఆయన ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

సినిమా ఇండస్ట్రీ అంటే అది పూల పాన్పు కాదు దానికి మించిన నరకం మరొకటి ఉండదు.

అవకాశం వచ్చే వరకు ఒంటిపూట భోజనం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు.అది కూడా దొరకని వారు కూడా ఉన్నారు.

అయినా కూడా ఒక్క అవకాశం దొరక్కపోతుందా అని ఆశతో ఆ ఇండస్ట్రీలోనే తిరుగుతూ ఉంటారు.

అలాంటి వారిలో డైరెక్టర్ తేజా కూడా ఒకరు.మద్రాసులో సినిమాల పరిశ్రమలోకి( Cinema Industry ) వెళ్లి ఒక వెలుగు వెలగాలని ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.

"""/" / మొదట సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు.ఆ తర్వాత దర్శకత్వం చేపట్టాడు.

ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా నిలబడ్డాడు కానీ మద్రాసులో( Madras ) ఒక్క పూట కూడా తిండి దొరకక పెట్రోల్ బంకులో పని చేశాడట.

తేజ అలా బ్రతుకుతున్న క్రమంలో తన జీవితంలో ఒక సంఘటన జరిగిందని ఆ సంఘటన వల్ల నాకు జీవితం అంటే ఏంటో అర్థం అయింది అని చెబుతున్నాడు.

ఇంతకీ ఏం జరిగింది అంటే పెట్రోల్ బంకులో పనిచేస్తున్న క్రమంలో తనను చిన్నప్పుడు బాగా ఎత్తుకొని ఆడించిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్( Family Friend ) పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చాడట.

కానీ తనని చూసిన గుర్తుపట్టనట్టు పెట్రోల్ పోయించుకునే డబ్బులు ఇచ్చి వెళ్లిపోయాడట. """/" / తనకు చిన్నతనంలో లాలీ, బుజ్జి, కన్నా అంటూ ఎంతో ముద్దు చేసిన అతను పట్టించుకోకపోవడంతో పరవాలేదు అనుకుని ఊరుకున్నాడట.

కానీ అదే వ్యక్తి తాను దర్శకుడు( Director ) అయ్యాక అతడి వల్లే తానేదో పెద్ద డైరెక్టర్ అయిపోయినట్టు తన గురించి గొప్పగా చెప్పి మా మావాడు మా వాడు అంటూ మాట్లాడడం మొదలు పెట్టాడట.

పైగా ఒకసారి ఇంటికి వచ్చి తనకు ఇబ్బందులు ఉన్నాయని డబ్బులు కావాలని కూడా అడిగాడట.

కానీ గతంలో జరిగిన విషయాలనేవి మనసులో పెట్టుకోకుండా అతనికి ఆ సహాయం చేశాడట తేజ.

అలా జీవితం అనే చక్రం లో చిన్నతనంలో అన్నీ ఉన్నప్పుడు తోడు ఉన్నవారు అలాగే సక్సెస్ అయ్యాక తోడు ఉన్నవారు కష్టంలో తోడు ఉండరు అని తెలుసుకున్నాడత తేజ.

మా నాన్న గురించి అలాంటి వార్తలు ప్రచారం చేశారు.. రాజీవ్ కనకాల కామెంట్స్ వైరల్!