భయపెట్టి మరీ సెన్సార్ సర్టిఫికెట్ ని జారీ చేసుకున్న దర్శకుడు?
TeluguStop.com
దర్శకుడుని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు.ఎన్నో కలలు కని, ఒక దర్శకుడు అనేవాడు నిర్మాతను ఒప్పించి మరి సినిమాను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సినిమాను తెరకెక్కిస్తాడు.
ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు.నటులు సరిగ్గా సినిమా చేయలేకపోయినా, నిర్మాతలు ఖర్చు చేయాల్సిన డబ్బుని ఖర్చు చేయలేకపోయినా, టెక్నీషియన్లు పొరపాట్లు చేసిన, ఆఖరికి బలయ్యేది దర్శకుడడే.
వాటన్నిటినీ దాటుకుని సినిమా పూర్తి చేస్తే, ఆ సినిమా సెన్సార్ దగ్గర ఆగిపోతే ఎలా ఉంటుంది? సెన్సార్ సభ్యుడిని ఉక్కు పాత్ర వేయాలనిపిస్తుంది కదూ.
"""/" /
సరిగ్గా అదే విషయం జరిగింది.దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ ( SA Chandrasekhar )విషయంలో.
దాంతో సెన్సార్ సభ్యుడి మీద కాలిన చంద్రశేఖర్ ఆయనకి పట్టపగలే చుక్కలు చూపించాడు.
దర్శకుడు చంద్రశేఖర్ గురించి మీరు వినే ఉంటారు.తమిళ స్టార్ హీరో విజయ్( Tamil Star Hero Vijay ) నాన్నగారు ఈ చంద్రశేఖర్.
ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన చంద్రశేఖర్ కి ఓ రోజు చేదు అనుభవం ఏర్పడింది.
ఎంతో కష్టపడి తీసిన సినిమా అన్ని అంచెలు దాటుకుని సెన్సార్ దగ్గరికి వెళ్ళగా, అప్పటి తమిళ సెన్సార్ దర్శకుడు వేణుగోపాలం( Director Venugopalam ) అతని సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని చెప్పాడట.
దాంతో కాలిన చంద్రశేఖర్ ఓ భయంకరమైన కథని వేణుగోపాలానికి చెప్పి ఆఖరికి సర్టిఫికెట్ వచ్చేలా చేసుకున్నాడట!.
"""/" /
అతనికి చంద్రశేఖర్ చెప్పిన కథ ఏమిటంటే? అనగా అనగా ఒక ధీరుడు( Anaga Anaga Oks Dheerudu ).
నా ధీరుడు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఒక సినిమా తీస్తే, ఆ సినిమా సెన్సార్ దగ్గరే ఆగిపోయింది.
దాంతో ఆ ధీరుడు కోపంతో.సెన్సార్ సభ్యులను అందరినీ తెగ నరికి తన కోపాన్ని తీర్చుకుంటాడు! ఇదే కథ అని చెప్పడంతో, అప్పటికే భయపడిన వేణుగోపాల్ క్షణాల వ్యవధిలో చంద్రశేఖర్ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నారు.
ఇదే విషయం ఆయన అనేకసార్లు మీడియా వేదికలలో చెప్పుకొచ్చారట.దాంతో వారు చంద్రశేఖర్ సినిమాలలోనే కాదు.
బయట కూడా భయపెట్టగలడు! అనే చమత్కరించారట?.
నాగ చైతన్య కార్తీక్ వర్మ కాంబోలో వస్తున్న సినిమా జానర్ ఏంటో తెలుసా..?