శ్రీ తేజ్ ను పరామర్శించిన సుకుమార్.. 5 లక్షల సాయం చేసిన డైరెక్టర్ వైఫ్!
TeluguStop.com
పుష్ప 2( Pushpa 2 ) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్( Sandhya Theater ) తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించిన విషయం తెలిసిందే.
ఈమె అక్కడికక్కడే మరణం పొందగా తన కుమారుడు శ్రీ తేజ్( Sree Tej ) తీవ్ర గాయాలు పాలయ్యారు.
ఇలా శ్రీ తేజ్ ప్రస్తుతం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు.
ఇక రేవతి మరణించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని( Allu Arjun ) పోలీసులు అరెస్ట్ చేశారు.
"""/" /
ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ కావటాన్ని ఇండస్ట్రీ మొత్తం తీవ్రస్థాయిలో ఖండించింది.
ఇకపోతే ఈ ఘటన జరిగిన రెండు రోజులకే అల్లు అర్జున్ ఈ ఘటన పై స్పందిస్తూ రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటానని అలాగే బాబు చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పినప్పటికీ ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్టు చేశారు.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చారు. """/" /
ఇక అల్లు అర్జున్ హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ ను పరామర్శించాలని భావించినప్పటికీ ప్రస్తుతం ఈయనపై కేసు ఉన్న నేపథ్యంలో హాస్పిటల్ కి వెళ్లలేరు.
అందుకే అల్లు అరవింద్( Allu Aravind ) ఇటీవల హాస్పిటల్ కి వెళ్లి ఆ చిన్నారిని పరామర్శించడమే కాకుండా తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు.
ఇక తాజాగా పుష్ప డైరెక్టర్ సుకుమార్( Sukumar ) సైతం హాస్పిటల్ కి వెళ్లి చిన్నారి శ్రీ తేజ్ ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని కనుక్కున్నారు.
ఇకపోతే ఈ ఘటన తర్వాత డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత( Thabitha ) డిసెంబర్ 9వ తేదీన ఆ చిన్నారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఆ చిన్నారీ వైద్య, విద్యా, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
దేవుడి హుండీలో రూ.20 నోటు వేసి ఏమి కోరుకున్నాడో తెలుస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాలిసిందే