కోలీవుడ్ ఇండస్ట్రీకి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన సుకుమార్… తిరుగుండదంటూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఒకరు.

ఆర్య సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశారు.

ఇక ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందారు.

ఇక పుష్ప 2 (Pushpa 2)సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో ఈయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది.

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీ అయ్యారు.

"""/" / ఇక సుకుమార్ కూడా రామ్ చరణ్ తో ఒక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత తిరిగి పుష్ప 3 పనులు ప్రారంభం కాబోతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా సుకుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీకి అదిరిపోయి గుడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి.

ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

పుష్ప లాంటి ఊర మాస్ సబ్జెక్ట్‌తో తమిళ్‌లో సినిమా చేస్తే ఎవరికి చేస్తారనే ప్ర‌శ్న వేశార‌ట‌ కొందరు కోలీవుడ్ ప్రముఖులు.

"""/" / ఈ ప్రశ్నకు సుకుమార్ ఏమాత్రం ఆలోచన చేయకుండా కార్తీ (Karthi)పేరు చెప్పేశారు.

కార్తీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి ఇలాంటి మాస్ సినిమా ఆయనతో తప్పకుండా చేస్తానని తెలిపారు.

అంతేకాకుండా సూర్య(Suriya) కూడా తన ఫేవరెట్ హీరో అంటూ సుకుమార్ చెప్పడంతో సూర్య కార్తీ హీరోల అభిమానులు ఎంతో సంబరం వ్యక్తం చేస్తున్నారు.

సూర్య, కార్తీతో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలే వదలుకోనని సుకుమార్ చెప్పడంతో కోలీవుడ్ సినిమా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారట.

ఇదే కనుక నిజమైతే ఈ హీరోలకు పాన్ ఇండియా స్థాయిలో ఇక తిరుగుండదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.