అతను లేకపోతే సుకుమార్ అనేవాడు ఇండస్ట్రీలోనే లేడు… ఎమోషనల్ అయిన డైరెక్టర్?

అతను లేకపోతే సుకుమార్ అనేవాడు ఇండస్ట్రీలోనే లేడు… ఎమోషనల్ అయిన డైరెక్టర్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు సుకుమార్(Sukumar ) ఒకరు.

అతను లేకపోతే సుకుమార్ అనేవాడు ఇండస్ట్రీలోనే లేడు… ఎమోషనల్ అయిన డైరెక్టర్?

ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

అతను లేకపోతే సుకుమార్ అనేవాడు ఇండస్ట్రీలోనే లేడు… ఎమోషనల్ అయిన డైరెక్టర్?

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరింత పేరు ప్రఖ్యాతలు రావడంలో సుకుమార్ పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పాలి.

అల్లు అర్జున్(Allu Arjun) తో ఈయన చేసిన పుష్ప సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. """/" / ఇదిలా ఉండగా తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ సుకుమార్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం సుకుమార్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటే అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి అని తెలిపారు.

చిరంజీవి(Chiranjeevi ) గారు లేకపోతే సుకుమార్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఉండేవారు కాదని తెలిపారు.

తాను ఇండస్ట్రీలోకి వచ్చి ఆర్య సినిమా చేశాను అంటే అందుకు కారణం చిరంజీవి అని తెలిపారు.

ఆర్య సినిమా కథ పట్టుకుని ఎంతోమంది హీరోల చుట్టూ తిరిగాను కానీ ఎవరు కూడా నాపై నమ్మకం పెట్టి ఎవరు సినిమా చేయటానికి ఒప్పుకోలేదు.

  కానీ చిరంజీవి గారికి ఈ కథ చెప్పడంతో వెంటనే అల్లు అరవింద్ కి ఫోన్ చేసి కథ అద్భుతంగా ఉంది బన్నీతో చేద్దాం అని చెప్పారు.

"""/" / అల్లు అరవింద్(Allu Aravind) కొత్త దర్శకుడు కథ అని అనుమానాలు వ్యక్తం చేసిన చిరంజీవి భరోసా ఇచ్చి నా చేత ఆర్య సినిమా చేయించారని, ఆ సినిమా మంచి హిట్ కావడంతో తనకు ఇండస్ట్రీలో తిరిగి అవకాశాలు వచ్చాయని తెలిపారు.

అలా చిరంజీవి కారణంగానే తాను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నాను అంటూ సుకుమార్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక రామ్ చరణ్ తో కూడా ఈయన రంగస్థలం వంటి సూపర్ హిట్ సినిమాని చేసిన సంగతి తెలిసిందే.

మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలియడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఆడవాళ్ళ‌ డైట్ లో కచ్చితంగా ఉండాల్సిన లడ్డూ ఇది..!