రాజమౌళి నెక్స్ట్ పై బిగ్ అనౌన్స్.. ఎట్టకేలకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన జక్కన్న!
TeluguStop.com
వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ హిట్ అందుకున్న పాన్ ఇండియన్ మూవీ ''రౌద్రం రణం రుధిరం''( RRR ).
ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా పలు అంతర్జాతీయ పురస్కారాలతో పాటు ఏకంగా ఆస్కార్ అందుకుంది.
ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీను మన డైరెక్టర్ రాజమౌళి ( Rajamouli ) తెరకెక్కించడం మన తెలుగు వారికీ గర్వకారణం.
రామ్ చరణ్ తేజ్ ( Ram Charan ), ఎన్టీఆర్ ( NTR ) హీరోలుగా తెరకెక్కిన ఈ భారీ మల్టీ స్టారర్ తర్వాత ఇప్పుడు రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను మహేష్ బాబు ( Mahesh Babu ) తో చేయబోతున్నాడు.
ప్రెజెంట్ ఈ సినిమా ( SSMB29 ) కోసం స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేస్తున్నారు.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంత వరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నాడు అని టాక్.
"""/" /
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తుంటే రాజమౌళి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.
అయితే ఇది మహేష్ ప్రాజెక్ట్ అనుకుంటే పొరపాటే.'మేడ్ ఇన్ ఇండియా' (MADE IN INDIA) అంటూ జక్కన్న ఒక ప్రాజెక్ట్ ను ప్రకటించాడు.
అయితే దీనికి రాజమౌళి దర్శకత్వం వహించడం లేదు.ప్రెజెంట్ చేస్తున్నాడు.
యమదొంగ సినిమాను తన సొంత బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ పై ప్రొడ్యూస్ చేసి సక్సెస్ కొట్టిన రాజమౌళి తన బ్యానర్ పై మరో సినిమాను ప్రకటించలేదు.
"""/" /
ఇక ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాను తన బ్యానర్ ద్వారా రిలీజ్ చేయగా.
ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు.
అసలు ఇండియన్ మూవీ ఎక్కడ ఎలా పుట్టింది? అనే కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తుండగా కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మిస్తున్నారు.
ఇక రాజమౌళి ఈ సినిమాను ప్రెజెంట్ చేయబోతున్నాడు.దీనిపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు.
ఆదిత్య 369 సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఆ విషయంలో డౌట్స్ అక్కర్లేదట!