అం అః రివ్యూ: ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ!
TeluguStop.com
డైరెక్టర్ శ్యామ్ మండల దర్శకత్వంలో రూపొందిన సినిమా.రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్ పై జోరిగే శ్రీనివాస్ రావు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.
ఇక ఇందులో సుధాకర్ జంగం, లావణ్య, సిరి కనకన్, రామరాజు, రవి ప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వర రావు తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాకు శివారెడ్డి సావనం సినిమాటోగ్రఫీ అందించాడు.సందీప్ కుమార్ కంగుల మ్యూజిక్ అందించాడు.
ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
పైగా ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందుకుందో చూద్దాం.h3 Class=subheader-styleకథ:/h3p కథ విషయానికి వస్తే ఇంజనీరింగ్ విద్యార్థులు అయిన కళ్యాణ్ (సుధాకర్), భల్లూ (రాజా), అరవింద్ (ఈశ్వర్) లు క్యాంపస్ లో జాబ్ సంపాదించుకొని సంతోషంగా ఉంటారు.
అయితే ఆ సంతోషంలో పబ్బుకి వెళ్లి పార్టీ చేసుకొని వెళ్లి వస్తుండగా అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుకుతారు.
అయితే ఈ కేసు నుంచి బయటపడాలి అంటే 20 లక్షలు ఇవ్వాలి అని సీఐ ఫణీంద్ర (రవి ప్రకాష్) వారిని బాగా డిమాండ్ చేస్తాడు.
దీంతో వాళ్ళు ఏమి చేయాలో తోచక కావ్య (సిరి) అని ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆమె తల్లిదండ్రుల నుంచి 20 లక్షలు డిమాండ్ చేస్తారు.
ఇక ఆ సమయంలో మాఫీయా రామరాజు హత్య జరుగుతుంది.దీంతో నిజంగానే ఈ ముగ్గురు మర్డర్ చేశారా.
లేదా.చేయని హత్యకు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు.
చివరికి ఈ కేసు నుంచి వారు ఎలా బయటపడతారు అనేది మిగిలిన కథలోనిది.
"""/"/
H3 Class=subheader-styleనటినటుల నటన: /h3pనటీనటుల విషయానికి వస్తే.సుధాకర్ రెడ్డి, ఈశ్వర్, రాజ తొలిసారి నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నారు.
రామరాజు విలన్ పాత్రతో ఆకట్టుకున్నాడు.మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
H3 Class=subheader-styleటెక్నికల్:/h3p సినిమాటోగ్రఫీ ని అద్భుతంగా చూపించారు.సందీప్ కుమార్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది.
ఎడిటింగ్ లో ఇంకాస్త మార్పులు ఉంటే బాగుండేది.నిర్మాణ విలువలు కూడా బాగా ఉన్నాయి.
H3 Class=subheader-styleవిశ్లేషణ:/h3p ఈ సినిమాకు దర్శకుడిగా పని చేసిన శ్యామ్ మంచి పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కానీ కథను చూపించే సమయంలో అక్కడక్కడ కాస్త పొరపాట్లు పడినట్లు కనిపించింది.అయినా సినిమాను ఆసక్తికరంగానే చూపించాడు.
కొంతవరకు సాగదీసినట్లు అనిపించినా కూడా ట్విస్టు మాత్రం బాగా ఉంది.రొటీన్ గా అనిపించినా కూడా బాగానే ఉందని చెప్పవచ్చు.
"""/"/
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p నటీనటుల నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ట్విస్ట్, ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు.
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p ఎడిటింగ్ లో ఇంకాస్త మార్పులు ఉంటే బాగుండేది.అక్కడక్కడ సాగదీసినట్లుగా అనిపించింది.
H3 Class=subheader-styleబాటమ్ లైన్:/h3p చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా మంచి థ్రిల్లర్, మర్డర్ మిస్టరీగా రూపొందింది.
కాబట్టి థ్రిల్లర్ కాన్సెప్ట్ ని ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది.
H3 Class=subheader-styleరేటింగ్: 3/5/h3p.
వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!