ఎన్నో ఎమోషన్స్ ఉన్న అతడి బయోపిక్ పై ఆసక్తిగా ఉన్న యంగ్ డైరెక్టర్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో శివ నిర్వాణ ఒకరు.ఈయన నిన్ను కోరి మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు.

ఇక నానితో చేసిన టాక్ జగదీష్ ప్లాప్ అయ్యింది.దీంతో ఈయనకు మరో అవకాశం రావడం కష్టమేమో అని అంతా అనుకున్నారు.

కానీ ఈయన అందరి అంచనాలను తలక్రిందులు చేసారు.ఏకంగా విజయ్ వంటి క్రేజీ హీరోతో సినిమా ప్రకటించి షాక్ ఇచ్చాడు.

విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబోలో ఒక సినిమా రాబోతుంది.ఖుషి అనే టైటిల్ తో తెరకెక్కుతూన్న ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత నటిస్తుంది.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి.ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని టాక్ బయటకు వచ్చింది.

ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇక ఈ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ కు ఒక బయోపిక్ మీద చూపు పడిందట.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పట్నం కేధరీశ్వరావు గురించి ఇటీవల చాలా మంది వినే ఉంటారు.

1998 సిఎస్సీ అభ్యర్థులకు 2022 లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో ఈయన పేరు వెలుగులోకి వచ్చింది.

అంత మందికి ఉద్యోగాలు వచ్చిన ఈయన పేరు బయటకు రావడానికి కారణం ఒకటి ఉంది.

టీచర్ అవ్వాలనే దృఢ సంకల్పంతో కేధరీశ్వరావు తన 24 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నారు.

తన తోటివారంతా ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా ప్రైవేట్ జాబులు చేస్తూ స్థిరపడిన ఈయన మాత్రం బీఈడీ చేతిలో ఉన్న కూడా తన కెరీర్ ను నాశనం చేసుకున్నాడు.

"""/" / ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆస్తులన్నీ కరిగి బికారిగా మారిపోవడమే కాకుండా తల్లిని కోల్పోయి.

ప్రేమించిన ప్రియురాలు వేరే వారిని వెతుక్కుని వెళ్లిపోగా.ఈయన తీవ్ర నిరుత్సాహంతో మానసికంగా కృంగిపోయి సొంత గ్రామంలోనే సైకిల్ మీద బట్టల వ్యాపారం చేస్తూ పని చేసిన రోజు మాత్రమే తింటూ మిగిలిన రోజు పస్తులు ఉంటూ గడుపుతున్నాడు.

ఈయన లైఫ్ ఈ డైరెక్టర్ ను కదిలించిందట.ఒక బిఈడీగా మరొక బీఈడీ లైఫ్ గురించి సినిమాను తెరకెక్కించాలని శివ నిర్వాణ అనుకుంటున్నాడని.

ఈయన బయోపిక్ ను తెరకెక్కిస్తాడని తెలుస్తుంది.

ప్రభాస్ ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న నాగ్ అశ్విన్..అంతగా నచ్చిందా?