Director Shankar : తనని నమ్ముకున్న నిర్మాత కోసం డైరెక్టర్ శంకర్ ఎంత పని చేసాడో తెలుసా ?

డైరెక్టర్ శంకర్( Director Shankar ) జెంటిల్ మెన్ సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు.

అతను చేసిన ప్రతి సినిమా ఎంతో విజయం సాధించాయి.దాంతో ఆ సినిమాలను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయడం మొదలుపెట్టారు.

శంకర్ మొదటి నుంచి అప్పటి నిర్మాత ఏఏం రత్నం( Am Rathnam ) తోనే ట్రావెల్ అవుతూ వచ్చారు.

మొదట్లో కేవలం శంకర్ తీసిన సినిమాలను తెలుగులో డిస్ట్రిబ్యూటర్ గా డబ్బింగ్ చేసి బాగానే కాసుల వర్షం కురిసేలా చేసుకున్నాడు.

అయితే శంకర్ కి నేరుగా భారతీయుడు సినిమాతో నిర్మాతగా కూడా మారాడు ఏ ఏం రత్నం.

ఈ సినిమా ఆ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.దీనిని తమిళ్ లో నిర్మించి తెలుగులో డబ్బింగ్ చేశాడు.

తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. """/" / అయితే ఇండియన్ సినిమా తర్వాత జీన్స్( Jeans ) చిత్రాన్ని తెరకెక్కించిన శంకర్ ఆ తర్వాత ఒకే ఒక్కడు సినిమాను తెరకెక్కించాడు.

ఆ సినిమాని హిందీలో నాయక్ పేరుతో కూడా రీమేక్ చేయగా ఈ సినిమా హిందీలో ఘోరమైన ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

దీంతో ఏ ఏం రత్నం ఉన్న ఫలంగా రోడ్డు మీదకు వచ్చేసాడు.విపరీతమైన అప్పుల పాలయ్యాడు దాంతో ఏం చేయాలో తెలియని శంకర్ ఆ తర్వాత తాను తీసిన బాయ్స్ సినిమాకి కూడా రత్నం చేతనే ప్రొడ్యూసర్ గా పెట్టి పాత సినిమా తాలూకా అప్పులను తీర్చాలని అనుకున్నా అది కూడా పరాజయం పాలైంది.

దాంతో పూర్తిగా ఏ ఎమ్ రత్నం మరింత కృంగిపోయాడు. """/" / ఇక చివరగా శంకర్ తన శిష్యుడైన బాలాజీ శక్తి వేల్( Balaji Shakti Vale ) తో కాదల్ సినిమాకి ఏం రత్నం చేత డబ్బులు పెట్టించాడు.

అదే సినిమా ప్రేమిస్తే పేరుతో తెలుగులో విడుదల చేయగా ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని రత్నంని గట్టెక్కించింది.

ఇలా మొత్తం గా తనను నమ్ముకున్న నిర్మాత కోసం వరుస పెట్టి సినిమాలో తీశాడు శంకర్.

ఒకానొక టైంలో రత్నం తప్ప మరొక నిర్మాతను ఎంకరేజ్ చేయలేదు.దాంతో రత్నం సైతం వరుస పెట్టి అనేక తమిళ సినిమాలను నిర్మించాడు.

ప్రస్తుతం తెలుగు లో కన్నా తమిళ్ లో ఎక్కువ సినిమాలను తీస్తూ మంచి స్థాయిలోనే ఉన్నాడు.

వైసీపీ మహిళలే టార్గెట్ గా టీడీపీ నేతల దాడులు.. ఏపీలో పరిస్థితులు ఇంత ఘోరమా?