శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు.. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో?

కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో గుర్తింపును సొంతం చేసుకున్న శంకర్ కు ఇతర భాషల్లో, విదేశాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఈ ఏడాది జూన్ నెలలో శంకర్ తన కూతురికి ప్రముఖ క్రికెట్ రోహిత్ దామోదరన్ తో పెళ్లి చేశారు.

తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో ఘనంగా ఈ పెళ్లి వేడుక జరగగా ఈ వేడుకకు తమిళనాడు సీఎం కూడా హాజరయ్యారు.

అయితే తాజాగా శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.పుదుచ్చేరి పోలీసులు రోహిత్ తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారని సమాచారం అందుతోంది.

పోక్సో చట్టం కింద పోలీసులు ఈ కేసును నమోదు చేసినట్టు తెలుస్తోంది.రోహిత్ దామోదరన్ 16 సంవత్సరాల మైనర్ బాలికను వేధించారనే ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు.

బాధిత బాలిక తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పుదుచ్చేరిలోని మెట్టుపాళయమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత బాలిక తాను క్రికెట్ కోచింగ్ కొరకు వెళ్లిన సమయంలో తనను లైంగికంగా వేధించారని చెప్పుకొచ్చారు.

"""/"/ వేధింపులకు సంబంధించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని బాధిత బాలిక చైల్డ్ వెల్ఫేర్ సొసైటీకి ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.

అయితే పోలీసులు క్రికెటర్ రోహిత్ దామోదరన్, అతని తండ్రి, కోచ్, మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

"""/"/ కొంతమంది నెటిజన్లు రోహిత్ దామోదరన్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

రోహిత్ దామోదరన్ ఈ ఆరోపణల గురించి స్పందించి వివరణ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

వైరల్ అవుతున్న వార్తల వల్ల రోహిత్ ఫ్యాన్స్ బాధ పడుతుండటం గమనార్హం.శంకర్ ఈ కేసు విషయంలో స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ