ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ప్లాన్ చేస్తున్న శంకర్.. చరణ్ ఫ్యాన్స్ ఖుషీ!
TeluguStop.com

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వెంటనే తర్వాత సినిమా స్టార్ట్ చేసాడు.


రామ్ చరణ్ హిట్ కొట్టిన జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.


ఇండియన్ అగ్ర దర్శకులు అయినా రాజమౌళి, శంకర్ లతో ఈయన బ్యాక్ టు బ్యాక్ పని చేస్తూ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇలా ఇప్పుడు ఉన్న స్టార్ దర్శకులిద్దరితో పని చేసిన ఘనత ఈయనకే సొంతం.
కాగా మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే అమృత్ సర్ లో, ఆపై వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.
ఇక త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది.మరి ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని శంకర్ కూడా కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
అలాగే రామ్ చరణ్ లుక్ లో కూడా విభిన్నంగా చూపించ నున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా గ్రాండ్ గా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్న లుక్ లలో కనిపించ నున్నట్టు టాక్.
ఇప్పటికే లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ ఐయ్యాయి. """/"/ ఇక ఇటీవలే మరొక లుక్ నెట్టింట వైరల్ అయినా విశ్యామ్ తెలిసిందే.
ఈ లుక్స్ తోనే శంకర్ ఊహించని ప్లాన్స్ చేస్తున్నట్టు టాక్ ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ మూవీలో రామ్ చరణ్ హీరోగా మాత్రమే కాకుండా విలన్ రోల్ లో కూడా తానే కనిపించనున్నాడని క్రేజీ బజ్ ఎప్పటి నుండో వినిపిస్తూనే ఉంది.
శంకర్ తన ఎక్స్పీఎరియన్స్ తో ఈ సినిమాలో చరణ్ ను అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారని వస్తున్న వార్తలపై చరణ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.
దిల్ రాజు భారీ బడ్జెట్ తో న నిర్మిస్తున్నారు.
నటుడు చిరంజీవి అల్లు అర్జున్ పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!