గేమ్‌ ఛేంజర్‌ : బ్రేక్‌ టైమ్ లో షూటింగ్ ఏంటి శంకర్‌ సర్‌?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ( Ram Charan )అభిమానులు దర్శకుడు శంకర్ విషయం లో చాలా అసంతృప్తి గా ఉన్నారు.

గేమ్‌ ఛేంజర్ సినిమా ప్రారంభం సమయం లో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారు.

కానీ ఇప్పుడు అదే సినిమా వల్ల మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ పూర్తి చేయలేదు.కానీ సినిమా షూటింగ్‌ విషయం లో ఇండియన్ 2 కే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే దర్శకుడు శంకర్‌ గేమ్‌ ఛేంజర్ కంటే కూడా ఎక్కువగా ఇండియన్ 2( Indian 2 ) కి ప్రాముఖ్యత ఇస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్ సినిమా షూటింగ్ జరుగుతోంది.నేటి నుండి షూటింగ్‌ ని ప్రారంభించిన దర్శకుడు శంకర్‌ చేస్తున్న పనికి యూనిట్‌ సభ్యులు అవాక్కవుతున్నారు.

"""/" / పక్కనే ఇండియన్‌ 2 సినిమా షూటింగ్‌ ను చేస్తున్నారు.

ఇండియన్ 2 సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సమయంలో.లంచ్ బ్రేక్ సమయంలో గేమ్‌ ఛేంజర్ సినిమా షూటింగ్‌ ను చేస్తున్నాడట.

ఇదెక్కడి విడ్డూరం బాబోయ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.బ్రేక్‌ టైమ్‌ లో రామ్‌ చరణ్‌ వంటి స్టార్‌ హీరో సినిమా కోసం దర్శకుడు శంకర్‌( Director Shankar ) ఇస్తున్న ప్రాముఖ్య ఇంతేనా అంటూ ఆయన్ను విమర్శిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

ఇండియన్‌ 2 సినిమా ను నాలుగు ఏళ్ల క్రితం మొదలు పెట్టిన దర్శకుడు శంకర్‌ మధ్య లో వదిలేసి గేమ్‌ ఛేంజర్ సినిమా ను మొదలు పెట్టాడు.

తీరా సినిమా ను ప్రారంభించిన తర్వాత ఇండియన్‌ 2 ను మళ్లీ మొదలు పెట్టాడు.

దాంతో గేమ్‌ ఛేంజర్ సినిమా షూటింగ్‌ విషయం లో శంకర్ అశ్రద్ద చూపిస్తున్నాడు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు.

రామ్ చరణ్ ఈ సినిమా ను ముగిస్తే బుచ్చి బాబు సినిమాను చేయాల్సి ఉంది.

అయితే బ్రేక్ టైమ్ లో షూటింగ్ చేస్తే ఎప్పటికి ముగించాల్సి ఉంటుందో అంటూ మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మ బాబోయ్.. పుష్ప-2 పాటకు బామ్మ ఊర మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్..