ఆ వార్త చదవడం వల్లే ఈ స్టోరీ రాసుకున్న అంటున్న విరూపాక్ష డైరెక్టర్..?

ఒక సినిమా తీయడం అంటే ఎంత కష్టమో సినిమా తీసేవాళ్లకి తెలుస్తుంది ఒక సినిమా కష్టం గురించి తెలిసినప్పుడే మనం వాళ్ళు తీసిన సినిమా మీద జోకులు వేయకుండా ఉంటాము అయితే పిచ్చి సినిమాలు చూసి వాటి మీద జోకులు వేసుకొని నవ్వుకున్నా వ్యక్తి ఒక సినిమా తీసేటప్పుడు సినిమా అంటే ఇంత కష్టం గా ఉంటుందా అని అనుకున్న వ్యక్తులు చాలా మందే ఉన్నారు.

ఇక ఆ విషయం పక్కన పెడితే కార్తిక్ దండు ( Karthik Dandu )అనే డైరెక్టర్ కి చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం.

కానీ ఆయనకి దెయ్యం లేకుండా హారర్ సినిమా తీయొచ్చా, అని అనుకొని దాన్ని ఒక ఛాలెంజింగ్ తీసుకొని తీసిన సినిమానే విరూపాక్ష( Virupaksha ).

తంత్రాలకు థ్రిల్ జోడించి తీసిన ఈ సినిమా థియేటర్లలో హిట్టయింది.అయితే ఇంతకీ ఈ ఆలోచన దర్శకుడికి ఎలా వచ్చింది? దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు డైరక్టర్ కార్తీక్ దండు.

"""/" / 2016 లో ఓ వార్త చదివాడంట ఈ దర్శకుడు.చేతబడి చేస్తుందనే అనుమానంతో గుజరాత్ లో ఓ మహిళను చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేశారంట.

నిజంగా ఆమెకు చేతబడి తెలిస్తే, ఆ గ్రామస్తుల్ని తను చంపేసి ఉండేది కదా అంటూ రివర్స్ లో ఆలోచించడం మొదలుపెట్టాడట.

ఆ ఆలోచన నుంచే విరూపాక్ష కథ పుట్టిందంటున్నాడు కార్తీక్. """/" / హారర్ కథలంటే తనకు చాలా ఇష్టమని తెలిపిన ఈ దర్శకుడు.

దెయ్యం ఎలిమెంట్ లేకుండా సినిమా తీయాలనే ఉద్దేశంతో విరూపాక్ష కథ రాసుకున్నట్టు తెలిపాడు.

ఈ కథను ముందుగా నమ్మిన వ్యక్తి సుకుమార్ ( Sukumar )అంట.ఆయన ఆధ్వర్యంలో దాదాపు 6-7 వెర్షన్లు రాశాడట దర్శకుడు.

అలా రాసిన వెర్షన్ల నుంచి ఫైనల్ గా ఓ వెర్షన్ తీసుకొని విరూపాక్ష స్టోరీ లాక్ చేశారట.

ఇక ప్రీ-క్లయిమాక్స్, క్లయిమాక్స్ లో వచ్చే ట్విస్టులకు సంబంధించి సుకుమార్ కు క్రెడిట్ ఇస్తున్నాడు కార్తీక్.

సుకుమార్ సలహాలు, సూచనల మేరకు క్లయిమాక్స్ మార్చానని తెలిపాడు.ఈ ప్రాజెక్టులోకి సాయితేజ్( Saitej ) రావడానికి మెయిన్ రీజన్ కూడా సుకుమార్ అంటున్నాడు కార్తీక్ దండు.

అరిజోనా డెమొక్రాటిక్ ప్రైమరీలో భారత సంతతి నేత గెలుపు.. ఎవరీ అమిష్ షా..?