ఆ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధ పడుతున్నా.. నటుడిపై సందీప్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో ఒకరైన సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ దర్శకుడి తర్వాత సినిమా ప్రభాస్ హీరోగా స్పిరిట్( Spirit ) అనే టైటిల్ తో తెరకెక్కుతోంది.

సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కించి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కబీర్ సింగ్( Kabir Singh ) సినిమాలో నటించిన అదిల్ హుస్సేన్( Adil Hussain ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు నా సినీ కెరీర్ లో ఎందుకు నటించానా అని బాధపడిన సినిమా కబీర్ సింగ్ మాత్రమేనని ఆయన అన్నారు.

ఆ సినిమాలో కాలేజ్ డీన్ గా నేను నటించానని అదిల్ హుస్సేన్ వెల్లడించారు.

నేను ఎన్నిసార్లు నో చెప్పినా ఒకే ఒకసారి షూట్ కు రావాలని అన్నారని అదిల్ హుస్సేన్ పేర్కొన్నారు.

"""/" / ఆ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని అదిల్ హుస్సేన్ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

వాళ్లు చెప్పిన సీన్ యాక్ట్ చేసి వచ్చేశానని ఆయన పేర్కొన్నారు.ఆ సీన్ మంచిగా అనిపించిందని సినిమా కూడా అలాగే ఉంటుందని భావించానని అదిల్ హుస్సేన్ వెల్లడించడం గమనార్హం.

విడుదలయ్యాక కబీర్ సింగ్ సినిమా చూసి ఈ సినిమాలో ఎందుకు నటించానా అని ఫీలయ్యానని అదిల్ హుస్సేన్ చెప్పుకొచ్చారు.

"""/" / స్నేహితుడితో కలిసి సినిమా చూడటానికి వెళ్లేన నేను మధ్యలోనే బయటకు వచ్చేశానని అదిల్ హుస్సేన్ అన్నారు.

అదిల్ చేసిన కామెంట్ల గురించి సందీప్ స్పందిస్తూ మిమ్మల్ని కబీర్ సింగ్ సినిమాలో తీసుకున్నందుకు ఇప్పటికీ బాధ పడుతున్నానని తెలిపారు.

ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐతో ఫిల్ చేస్తానని సందీప్ పేర్కొన్నారు.

ఈ వారం థియేట్రికల్, ఓటీటీ క్రేజీ సినిమాలు ఇవే.. ఆ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయా?