సుహాస్ ని అలా అనడంతో  చాలా కోపం వచ్చింది…. అందుకే ఆ వ్యక్తిని…

తెలుగులో నూతన దర్శకుడు "సందీప్ రాజ్" దర్శకత్వం వహించిన "కలర్ ఫోటో" అనే చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.

 అయితే ఈ చిత్రంలో హీరోగా పలు చిత్రాల్లో కమెడియన్ గా నటించిన టాలీవుడ్ నటుడు "సుహాస్" నటించగా తెలుగమ్మాయి "చాందిని చౌదరి" హీరోయిన్ గా నటించింది.

 అయితే ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో "ఆహా" ఓటిటి లో విడుదల చేశారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు సందీప్ రాజ్ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఈ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని విడుదల చేసిన తర్వాత కొంత మంది ఈ సినిమా గురించి నెగిటివ్ గా కామెంట్ చేయడం, ట్రోల్ చేయడం వంటివి చేశారని తెలిపాడు.

 అయితే మొదట్లో సినిమా అవకాశాల కోసం తన దగ్గరికి వచ్చిన వాళ్ళే తన గురించి మరియు కలర్ ఫోటో చిత్రం గురించి నెగిటివ్ గా మాట్లాడారని తనకు తర్వాత తెలిసిందని చెప్పుకొచ్చాడు.

అలాగే ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో సుహాస్ చాలా కష్టపడ్డాడని జ్వరం వచ్చినా కూడా సినిమా షూటింగులో పాల్గొన్నాడని తెలిపాడు.

అయితే ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా సెట్లో ఓ వ్యక్తి సుహస్ ని చూసి ఇలా అయితే తాను కూడా హీరో అయిపోతానని కొంతమేర వ్యంగంగా మాట్లాడాడట.

దీంతో తనకి కోపం వచ్చి వెంటనే సెట్ ని క్లియర్ చేయమని తన అసిస్టెంట్ డైరెక్టర్ కి చెప్పడంతో వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లి పోయాడని తెలిపాడు.

అంతేకాక ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డ సుహాస్ గురించి అలా మాట్లాడేసరికి తన ఆవేశం కట్టలు తెచ్చుకుందని, అందువల్లే సీరియస్ అయ్యానని తెలిపాడు.

అలాగే సినిమాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడేటువంటి వారి మాటలు అస్సలు పట్టించుకోనని, తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతుంటానని కూడా స్పష్టం చేశాడు.

అయితే ప్రస్తుతం సందీప్ రాజ్ తన రెండో చిత్ర దర్శకత్వ పనుల పై దృష్టి సారిస్తున్నాడు.

అంతేగాక తొందరొలోనే తన తదుపరి చిత్ర వివరాలని తెలియజేస్తానని తెలిపాడు. ఇక సుహాస్ విషయానికొస్తే తెలుగులో నూతన దర్శకురాలు సృజన రావు దర్శకత్వం వహిస్తున్న "గమనం" చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

 అలాగే టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న రంగ్ దే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

భార్య, పిల్లలను చంపేందుకు ఎన్నారై డాక్టర్ ప్రయత్నం.. కట్ చేస్తే..??