Director Ravi Kumar: పబ్లిక్ లో హీరోయిన్ కు ముద్దు పెట్టిన టాలీవుడ్ డైరెక్టర్.. ఇలాంటి పనులు చేసి ఇండస్ట్రీ పరువు తీయొద్దంటూ?

మామూలుగా, హీరో హీరోయిన్లు బయట కనిపించారంటే చాలు అభిమానులు వారితో సెల్ఫీలు దిగడానికి ఆటోగ్రాఫ్ లు తీసుకోవడానికి దిగబడుతూ ఉంటారు.

అలాగే సినిమా ఈవెంట్లకు సంబంధించిన ఫంక్షన్లు ఏవైనా సెలబ్రేషన్స్ కి హీరోయిన్స్ పాల్గొన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.

భారీగా బందోబస్తు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు అభిమానులు హీరోయిన్లకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

అసభ్యంగా ప్రవర్తించడం, చేతులు వేస్తూ వారిని వేధించడం లాంటివి చేస్తూ ఉంటారు.ఇటువంటి సంఘటనలు ఎక్కువగా పబ్లిక్ ప్లేస్ లో అభిమానుల నుంచి హీరోయిన్ లకు ఎదురవుతూ ఉంటాయి.

ఇప్పుడు మాత్రం ఒక తెలుగు మూవీ దర్శకుడు పబ్లిక్‌గా హీరోయిన్‌కి ముద్దుపెట్టేశాడు.ఆ దర్శకుడు మరెవరో కాదు ఏఎస్ రవికుమార్.

( Director Ravi Kumar ) రాజ్ తరుణ్( Raj Tharun ) హీరోగా నటించిన తిరగబడరా స్వామి( Tiragabadara Swamy Movie ) సినిమాకు దర్శకత్వం వహించారు.

"""/" / ఈ సినిమాలో హీరోయిన్ గా మన్నారా చోప్రా( Mannara Chopra ) నటించింది.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా తాజాగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది.

ఇక ఈ ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత చిత్ర బృందం ఫోటోలకు ఫోజులు ఇస్తున్న క్రమంలో హీరోయిన్ మన్నారా చోప్రా అనుమతి లేకుండా ఆమెకు ముద్దుపెట్టేశాడు.

"""/" / ఆమె నవ్వేసి ఊరుకుంది గానీ వీడియో చూస్తుంటే మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీలైనట్లు అనిపిస్తోంది.

దీంతో నెటిజన్స్.సదరు డైరెక్టర్ తీరుపై విమర్శిస్తున్నారు.

అలా చేయడం తప్పు అంటూ సదరు డైరెక్టర్ పై మండిపడుతున్నారు.హీరోయిన్ అనుమతి లేకుండా అలా అందరి ముందు ఆమెకు ముద్దు పెట్టడం ఏంటి చాలా గలీజ్ గా ఉంది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

మరి ఈ వీడియో పై డైరెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరోమారు సాధువును దర్శించుకున్న కోహ్లీ దంపతులు.. (వీడియో)