లవ్ యూ ఒంగోలు పోలీస్.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ సంచలనం
TeluguStop.com
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేశారు.
తాజాగా, తన ట్వీట్‌తో సంచలనం రేపారు.‘‘I LOVE ONGOLE.
I LOVE ONGOLE POLICE EVEN MORE’’ అంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు( Ongole Police Station ) విచారణ కోసం హాజరయ్యారు.
విచారణ అనంతరం వర్మ చేసిన ట్వీట్ మళ్లీ వివాదానికి కారణమైంది.అతని ట్వీట్‌లో కనిపించిన మద్యం గ్లాస్ మరింత దుమారం రేపుతోంది.
ఈ క్రమంలో వర్మ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. """/" /
రామ్ గోపాల్ వర్మకు తాజాగా CID నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 10న గుంటూరు CID కార్యాలయానికి హాజరుకావాలని కోరింది.2022 నవంబర్ 29న నమోదైన కేసుకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ( Bandaru Vamshikrishna ) గతంలో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు.
వర్మ తన వ్యాఖ్యలతో తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీశాడని ఆయన ఆరోపించారు.ఫిర్యాదును పరిశీలించిన CID, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపింది.
"""/" /
వర్మ ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.వర్త్.
వర్మ, వర్త్.అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.
మరికొందరు, వర్మే వర్మ.ఎక్కడా తగ్గరంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
మరికొందరైతే.ఇలాంటివి పద్దతులు అనవసరమా అంటూ విమర్శిస్తున్నారు కూడా.
ఇక CID విచారణపై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
వర్మ ట్వీట్ వల్ల మొదలైన ఈ రచ్చ ఎలా ముగుస్తుందో చూడాలి.