దండం పెడితే జనాలు మాట వినరంటున్న వర్మ.... 

ఎలాంటి విషయాన్నిఐనా సుత్తి లేకుండా సూటిగా చెప్పడం లో టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టింది పేరు.

అంతేగాక ఎప్పుడూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు ఈ దర్శకుడు.

అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎమర్జెన్సీ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ జనాలు వినకుండా రోడ్లపై సంచరిస్తూ పోలీసుల మాటలను బేఖాతరు చేస్తున్నారు.అయితే తాజాగా లాక్ డౌన్ సమయంలో ఓ వ్యక్తి స్కూటర్ మీద బయటకి రావడంతో పోలీసులు దండం పెడుతూ బయటికి రావద్దంటూ వెనక్కి వెళ్లిపోవాలని చెబుతున్న ఓ మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే తాజాగా ఈ వీడియోపై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.ఇందులో భాగంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియోని ట్యాగ్  చేస్తూ ఇలాంటి సమయంలో పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉందొద్దని ఒకవేళ ఇలాగ ఫ్రెండ్లీ గా ఉంటే జనాలు మాట వినరని అంతేకాక నెత్తిన ఎక్కి కూర్చుంటారని ట్వీట్ చేశాడు.

దీంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.దీంతో ఈ ట్వీట్ చేసినటువంటి రామ్ గోపాల్ వర్మకి నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు.

దేశంలో అసలే ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంటే ఇలా ప్రజలు రోడ్లపై తిరుగుతూ కరోనా వైరస్ కి మరింత సహాయం చేస్తున్నారంటూ  మండిపడుతున్నారు.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాంగోపాల్ వర్మ "ఘీర్" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిథున్ చక్రవర్తి, అభిషేక్ బచ్చన్ మకరంద్ దేశ్ పాండే, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

రేపు పాతబస్తీలో అమిత్ షా పర్యటన..!