అప్సర వెంటనే ఒకే చెప్పేసింది.. కానీ నైనా ఒప్పుకోవడానికే చాలా టైమ్ పట్టింది!
TeluguStop.com
డేంజరస్ అనే సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించిన అప్సర, నైనా గంగూలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతిలో చిక్కిన ఈ హాట్ బ్యూటీలు అందరి దృష్టిలో పడ్డారు.
తమ అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కించారు.ఏకంగా లెస్బియన్ పాత్రలో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ చేతిలో పడ్డ ఈ ముద్దుగుమ్మలు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
నిజానికి టాలీవుడ్ ప్రేక్షకులకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.
ఎందుకంటే ఈయన తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకున్నాడు.ఈయన ప్రతి ఒక్క విషయంలో సంచలనంగా మారాడు.
కెరీర్ మొదట్లో ఎన్నో మంచి మంచి సినిమాలను తెరకెక్కించాడు.చాలా వరకు ఎంతోమంది యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు.
గత కొంతకాలం నుండి వర్మ స్టైల్ మొత్తం మారింది.ఆయన సినిమా రుచులు కూడా మొత్తం మారిపోయాయి.
పైగా కాంట్రవర్సీ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.దాంతో ప్రేక్షకుల నుండి బాగా కౌంటర్లు ఎదుర్కొంటున్నాడు.
"""/"/
నిజానికి వర్మ కు వచ్చే కౌంటర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక ఆయన చేసే కామెంట్లు, కౌంటర్ల గురించి భరించలేం.ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయన్నమాట.
ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.ఈయన చేసే పోస్టుల గురించి అందరికి తెలిసిందే.
హాట్ హాట్ గ్లామర్ బ్యూటీ లతో ఫోటోలు దిగుతూ, డాన్సులు చేస్తూ బాగా రెచ్చి పోతూ ఉంటాడు.
వర్మ ఎంజాయ్ చేసే విధానాన్ని చూస్తే కుర్రాళ్లు మాత్రం చాలా కుళ్లుకుంటారు.ఏం అదృష్టం అడుకొచ్చుకున్నారు సార్ అంటూ తెగ కామెంట్లు పెడుతూ ఉంటారు.
ఇదంతా పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ అప్సర, నైనా లతో మరో సినిమా రూపొందించాడు.
ఆ సినిమాకు 'మా ఇష్టం' అనే పేరు పెట్టగా ఆ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
"""/"/
ఇక ఈ సినిమాను కూడా లెస్బియన్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందించాడు వర్మ.
ఇక ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రస్తుతం ప్రమోషన్స్ విషయంలో బాగా బిజీగా ఉన్నాడు.
తాజాగా హైదరాబాదులో.డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అప్సర రాణి, నైనా గంగూలీ ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
ఇక తమ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు వర్మ.
'మా ఇష్టం' అనేది ఒక క్రైమ్ డ్రామా మూవీ అంటూ.అందులో లీడ్ పెయిర్ లెస్బియన్స్ గా నైనా, అప్సర బాగా నటించారని అన్నాడు.
ఇక ఈ సినిమాలో నటించడానికి అప్సర ఎక్కువ సమయం తీసుకోకుండానే ఓకే చెప్పిందని.
కానీ నైనాను ఒప్పించడానికి మాత్రం చాలా సమయం పట్టిందని తెలిపాడు.
మటన్ తినడం లాభమా.. నష్టమా?