అందుకే నేను మెగా హీరోలతో సినిమాలు తీయను…

తెలుగులో ఒకప్పుడు అక్కినేని హీరో నాగార్జునతో శివ లాంటి సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టినటువంటి ప్రముఖ వివాదాస్పద దర్శకుడు "రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు మాదిరిగా ఈ మధ్యకాలంలో తన చిత్రాలతో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోతున్నాడు.

కాగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ తాను దర్శకత్వం వహించిన దెయ్యం" చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించిన స్వాతి దీక్షిత్ తో కలిసి పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా దెయ్యం చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలో లో ఇంటర్వ్యూ చేసే యాంకర్ మీరు ఎందుకు మెగా హీరోలతో సినిమాలు చేయడం లేదని అందుకు ఏదైనా ప్రత్యేకంగా కారణాలు ఉన్నాయా అని ప్రశ్నించింది.

దీంతో రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై స్పందిస్తూ మెగా హీరోలతో సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏవి లేవని అంతేకాకుండా తాను ఎక్కువగా వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తుంటానని అందువల్ల పెద్ద హీరోల అంచనాలను తాను అందుకోలేనని ఒకవేళ తాను రిస్క్ చేసి సినిమా చేసినా కూడా ఫలితం మాత్రం తారుమారుగా ఉంటుందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

అలాగే ఇప్పటి వరకూ తాను వకీల్ సాబ్ చిత్రాన్ని చూడలేదని కూడా చెప్పుకొచ్చాడు.

"""/"/ ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్లో డీ కంపెనీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రం బాలీవుడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

కాగా తెలుగులో రామ్ గోపాల్ వర్మ అనే చిత్రానికి దర్శకత్వం వహించగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి.

దీంతో ఈ నెల 16వ తారీకున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 .

విధ్వంసం సృష్టించిన హార్థిక్.. ఒకే ఓవర్లు 29 పరుగులు