వందల కోట్ల ఆస్తులున్న రాజమౌళి వాటికోసం రూపాయి కూడా ఖర్చు చేయరా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) ఒకరు.

ఈయన తన కెరియర్ బుల్లితెరపై ప్రారంభించారు.ఇలా బుల్లితెర సీరియల్స్ కి దర్శకుడిగా పని చేస్తున్నటువంటి రాజమౌళికి ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా తరువాత ఈయనకు ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇప్పటివరకు రాజమౌళి తన సినీ కెరియర్ లో 12 సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఇలా ఈయన దర్శకత్వం వహించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈ సినిమాలో మాత్రం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

ఈ సినిమాల ద్వారా ఈయన అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకు రానటువంటి గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్( Oscar ) వంటి అవార్డులు కూడా రాజమౌళితోనే సాధ్యమయ్యాయని చెప్పాలి.

"""/"/ ఇక ఈయన ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్( Rajamouli Remuneration ) తీసుకుంటూ భారీ స్థాయిలోనే ఆస్తులను కూడా పోగు చేశారు.

పలు నివేదికల ప్రకారం రాజమౌళి సుమారు 350 కోట్లకు పైగా ఆస్తులను( Rajamouli Properties ) కూడా పెట్టారని తెలుస్తోంది.

ఇలా వందల కోట్లలో ఆస్తి ఉండి స్టార్ సెలబ్రిటీ హోదా అనుభవించేవారు తరచూ పెద్ద ఎత్తున పార్టీలంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ రాజమౌళి మాత్రం ప్రతి రూపాయికి చాలా విలువ ఇస్తారని ఈయన సంపాదించినది మొత్తం సేవింగ్స్ మాత్రమే చేస్తారని తెలుస్తోంది.

"""/"/ ఇలా కోట్ల సంపాదించినప్పటికీ రాజమౌళి ఎప్పుడూ కూడా పార్టీలకు పబ్బులకు రూపాయి కూడా ఖర్చు చేయరని తెలుస్తుంది.

మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈయన ఈ విధమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఆ డబ్బును సేవ్ చేస్తూ ఉంటారట.

"""/"/ఇలా ఆలోచించబట్టే ఈయన ఈ స్థాయిలో ఉన్నారని తెలుస్తోంది.అయితే మనిషి అన్న తర్వాత కొంచమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ రాజమౌళికి అలాంటివేమి పట్టవని ఆయనకు సినిమాలే ప్రపంచం అంటూ పలు సందర్భాలలో రాజమౌళి సినిమా పిచ్చి గురించి ఎంతోమంది సెలబ్రిటీలు తెలియచేశారు.

ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు( Mahesh Babu ) తో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

బయట రూ.100, 200లకు చెప్పులు, బూట్లు కొంటున్నారా? అవి ఎక్కడి నుంచి వస్తాయంటే?