ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డ్ రావడానికి ఆ ఒక్క వ్యక్తే కారణమా?

ఆర్ఆర్ఆర్ (RRR)మూవీకి ఆస్కార్ అవార్డ్(Oscar Award) రావాలని ఎంతోమంది ఆకాంక్షించగా ఎట్టకేలకు ఆ కల నెరవేరింది.

నాటు నాటు సాంగ్(Naatu Naatu Song) భారతీయ ప్రేక్షకుల కలను నిజం చేసింది.

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చిందనే విషయం తెలిసి సినీ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే ఈ సినిమాకు ఆస్కార్ రావడానికి కారణమైన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే రాజమౌళి (Rajamouli) పేరు సమాధానంగా చెప్పాలి.

అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ మూవీకి పబ్లిసిటీ దక్కేలా జక్కన్న చేసిన ప్రయత్నాల వల్లే ఈ అరుదైన ఘనత సొంతమైంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి ప్రతిష్టలను ఆర్ఆర్ఆర్ మూవీ రెట్టింపు చేసింది.నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ ఖాయమని ప్రచారం జరగగా ఆ ప్రచారం ఎట్టకేలకు నిజం కావడం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

జక్కన్న ధైర్యమే ఆస్కార్ కలను నెరవేరేలా చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. """/" / సీఎం కేసీఆర్ నాటు నాటు సాంగ్ తెలంగాణ సంస్కృతి, తెలుగు అభిరుచికి నిదర్శనమని పేర్కొన్నారు.

భారతీయ జెండా రెపరెపలాడుతోందని ఆర్.ఆర్.

ఆర్ టీమ్ కు అభినందనలు అని జగన్ చెప్పుకొచ్చారు.భారతీయ చిత్రానికి గర్వించే క్షణాలు ఇవి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

రాజమౌళి విజన్, ధైర్యం, నమ్మకం వల్లే అవార్డ్ రావడం సాధ్యమైందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

"""/" / చరణ్, ఎన్టీఆర్, ఆర్.ఆర్.

ఆర్ చిత్ర బృందానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.చరిత్ర సృష్టించాం భారతీయులందరికీ ఇది గుర్తుండిపోయే రోజు అని రవితేజ చెప్పుకొచ్చారు.

బాలయ్య సైతం ఆర్.ఆర్.

ఆర్ చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు.అయితే ఆస్కార్ రావడానికి కారణం కార్తికేయ కూడా అని మార్కెటింగ్ వ్యవహారాలను చూసుకున్న వ్యక్తి అతనేనని సమాచారం అందుతోంది.

రాజమౌళి భవిష్యత్తులో మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పవన్ అన్నప్రాసన సమయంలోనే అలాంటి పని చేశాడా.. సీక్రెట్ రివీల్ చేసిన అంజనాదేవి?