మహేష్ సర్కారీ వారి పాట చిత్రం పై స్పందించిన డైరెక్టర్ రాఘవేంద్ర రావు... ఏమన్నారంటే?
TeluguStop.com
రెండున్నర సంవత్సరాల తర్వాత సర్కారు వారి పాట సినిమా ద్వారా మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ పాటికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గీతగోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ చూసి అభిమానులందరూ ఫిదా అయిపోతున్నారు.మహేష్ బాబు అభిమానులతోపాటు ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ రివ్యూస్ ని ప్రకటిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా మహేష్ బాబు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల సర్కారు వారి పాట సినిమా చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్వీట్ చేస్తూ.
సర్కారు వారి పాట సినిమాలో మహేశ్ బాబూ నటన గురించి పాజిటివ్ కామెంట్స్ చేసాడు.
"ఈ సినిమాలో మహేశ్ బాబూ ఎనర్జిటిక్ నటన, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా ఉన్నాయి" అంటూ ట్వీట్ చేసారు.
ఈ సందర్భంగా సర్కారు వారి పాట సినిమా మొత్తం టీమ్ కి రాఘవేంద్ర రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
"""/" /
సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా సర్కారు వారి పాట సినిమా గురించి స్పందించారు.
ప్రముఖ వైఎస్సార్‌సీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మహేశ్ బాబూ సినిమా మీద ప్రశంసలు కురిపించారు.
సమకాలీన అంశాలతో, ప్రజలకు మంచి సందేశం ఇచ్చేలా సర్కారు వారి పాట సినిమా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి26, బుధవారం 2025