అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు కొడుకు.. హీరోగా నిలబెట్టేందుకు అష్టకష్టాలు పడుతున్న పూరీ

పూరీ జగన్నాథ్.టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్.

ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశాడు.అందులో పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి.

అయితే ఎంతో మందిని టాప్ హీరోలుగా మలిచిన పూరీ జగన్నాథ్.తన ఫ్యామిలీ మెంబర్స్ ను మాత్రం మంచి హీరోలుగా తీర్చిదిద్దలేకపోడుతున్నాడు.

తాజాగా తన కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టేందుకు ఆ హీరోను, ఈ హీరోను పట్టుకుని ప్రమోషన్స్ చేయిస్తున్నాడు.

తాజాగా తన కొడుకు సినిమాకు హైప్ తెచ్చేందుకు ఏకంగా పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ ను బరిలోకి దింపాడు.

నిజానికి పూరీ జగన్నాథ్ హిట్స్, ఫట్స్ అని పెద్దగా పట్టించుకోడు.వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాడు.

అయితే తన ఫ్యామిలీ నుంచి ఓ హీరో ఉండాలని అని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు.

అందులో భాగంగానే తన కొడుకు మంచి హీరోగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు.అయితే ఈయన అనుకున్నంత ఈజీగా ఆ పని జరగట్లేదు.

అందుకే తన తనయుడు తాజాగా హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ అనే సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజిలో చేస్తున్నాడు.

తొలుత పూరీ ఫ్యామిలీ నుంచి తన తమ్ముడు సాయి శంకర్ ను హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నించాడు.

తనే స్వయంగా దర్శకత్వం వహించి పలు సినిమాలు తీశాడు.కానీ తను అనుకున్నంత స్థాయిలో నిలబడలేదు.

ఇప్పుడు తన కొడుకును హీరోగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు.ఇప్పటికే తను పలు సినిమాలు చేసినా.

అంతగా సక్సెస్ కాలేదు. """/"/ తాజాగా ఆకాష్, కేతిక జంటగా అనిల్ దర్శకత్వంలో రొమాంటిక్ అనే సినిమా తెరకెక్కింది.

అక్టోబర్ 29న ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది.ఈ సినిమాతోనైనా ఆకాష్ తన సత్తా చాటుకునేలా ప్రయత్నిస్తున్నాడు పూరీ.

అందుకే ప్రభాస్ సహా పలువురు హీరోలతో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయిస్తున్నాడు.అటు ప్రీరిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యాడు.

మొత్తానికి పూరీ ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

మహేష్ వాయిస్ వల్ల ముఫాసాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు .. సూపర్ స్టార్ రేంజ్ ఇదే!