Puri Jagannadh Movies : పూరీ డైరెక్షన్ లో తెరకెక్కిన బద్రి, ఆంధ్రావాలా, పోకిరి, చిరుత సినిమాలకు మొదట అనుకున్న టైటిల్స్ ఇవే!

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్( Puri Jagannadh ) గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగులో ఎన్నో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు మరియు జగన్నాథ్.

మధ్యలో కెరియర్ కాస్త డల్ అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

ఇకపోతే పూరి జగన్నాథ్‌ సినిమాల్లోని హీరోల క్యారెక్టరైజేషన్లు, డైలాగులు, కామెడీ ట్రాక్‌ ఇలా అన్నీ వెరైటీగా ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే.

అన్నింటినీ మించి అంతవరకుఎవరూ పెట్టని టైటిల్స్‌ పెట్టడానికే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తాడు పూరి.

అయితే ఇప్పటివరకు వచ్చిన పూరి సినిమాలకు మొదట వేరే టైటిల్స్‌ అనుకున్నారని, ఎన్నో డిస్కషన్స్‌ తర్వాత ఫైనల్‌గా బయటికి వచ్చిన టైటిల్స్‌ అవి అన్న విషయం చాలా మందికి తెలీదు.

అలా అతని సినిమాలకు ముందు అనుకున్న టైటిల్స్‌ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పోకిరి.( Pokiri ) అయితే ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్‌ ఉత్తమ్‌సింగ్‌.

అలాగే పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌లా నిలిచిపోయే సినిమా బద్రి.( Badri Movie ) రేణు దేశాయ్‌, అమీషా పటేల్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ గా నిలిచింది.

ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు చెలి. """/" / పవన్‌ కళ్యాణ్‌ లాంటి హీరోకి ఆ టైటిల్‌ మరీ క్లాస్‌ అయిపోతుందని భావించిన పూరి దాన్ని బద్రిగా మార్చారు.

రామ్‌ చరణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి తెరకెక్కించిన సినిమా చిరుత.( Chirutha Movie ) ఈ సినిమాకి మొదట కుర్రాడు అనే టైటిల్‌ని నిర్ణయించారు.

అంతేకాదు లో క్లాస్‌ ఏరియా అనే ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టారు.ఈ టైటిల్‌ చిరంజీవి తనయుడికి సరిపోయేలా లేదని భావించి చిరుత నయుడు అని అర్థం వచ్చేలా చిరుత అనే టైటిల్‌ను ఫైనల్‌ చేశారు.

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఆంధ్రావాలా.( Andhrawala Movie ) పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అందర్నీ నిరాశ పరచింది.

"""/" / ఈ సినిమాకి మొదట కబ్జా అనే టైటిల్‌ అనుకున్నారట.పూరి జగన్నాథ్‌ ఎక్కువ సినిమాలు చేసింది రవితేజతోనే.

ఇడియట్‌, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, నేనింతే, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి.

ఇలా అన్నీ విభిన్నమైన టైటిల్స్‌తోనే వచ్చాయి.అయితే ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రానికి మొదట జీవితం అనే టైటిల్‌ అనుకున్నారట.

ఈ టైటిల్‌ ఎంతో నార్మల్‌ వుందని, టైటిల్‌ లోనే నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ కనిపిస్తున్నాయని భావించిన పూరి దాన్ని ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం గా మార్చారు.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన లైఫ్ లో చేసిన అతిపెద్ద తప్పు ఏంటో మీకు తెలుసా?