సినిమా ఫ్లాప్ అవ్వకపోతే అడుక్కుతింటారంటున్న పూరీ జగన్నాథ్!

సినిమా ఫ్లాప్ అవ్వకపోతే అడుక్కుతింటారంటున్న పూరీ జగన్నాథ్!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ మధ్య కాలంలో పూరీ మ్యూజింగ్స్‌ ద్వారా అనేక విషయాల గురించి స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సినిమా ఫ్లాప్ అవ్వకపోతే అడుక్కుతింటారంటున్న పూరీ జగన్నాథ్!

తాజాగా పూరీ ఫ్లాప్ సినిమాల గురించి స్పందిస్తూ వాటి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సినిమా ఫ్లాప్ అవ్వకపోతే అడుక్కుతింటారంటున్న పూరీ జగన్నాథ్!

పూరీ ఫ్లాప్ సినిమాలను ఎవరూ కోరుకోరని.ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరూ సినిమా తీయరని అన్నారు.

సంవత్సరంలో వందల సంఖ్యలో సినిమాలు విడుదలైతే పది మాత్రమే బ్లాక్ బస్టర్, హిట్ సినిమాలు ఉంటాయని చెప్పారు.

ఫ్లాప్ సినిమాల రివ్యూలను చదివిన నిర్మాత అన్నీ అమ్ముకుని ఇండస్ట్రీని వదిలిపెట్టి పోతాడని ఆ తర్వాత అతని స్థానంలోకి మరో వ్యక్తి వస్తాడని చెప్పారు.

ఆ నిర్మాత ఇంకో ఫ్లాప్ సినిమా తీస్తాడని అన్నారు.వాస్తవం ఏమిటంటే ఇండస్ట్రీ ఫ్లాప్ అయిన 90 సినిమాలపైనే బ్రతుకుతోందని.

ఇండస్ట్రీలోని అందరికీ ఫ్లాప్ సినిమాలే అన్నం పెడుతున్నాయని చెప్పారు.దేశానికి ఫ్లాప్ సినిమా వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

నిర్మాత ఫ్లాప్ సినిమా వల్ల కోట్లు నష్టపోయినా యాక్టర్లు, జూనియర్ ఆర్టిస్టులు, సెట్లు, లొకేషన్లు, అవుట్ డోర్ యూనిట్ ఇలా ఎంతోమందికి ఉపాధి లభించడంతో పాటు వారి నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో డబ్బు వెళుతుందని చెప్పారు.

నిర్మాత వెబ్ సైట్లు, హోటళ్లు, రైళ్లు, విమానాలు, హోర్డింగ్ లు, పేపర్ యాడ్ లకు కూడా డబ్బులు చెల్లిస్తాడని కానీ మన ట్వీట్ల ద్వారా ఫ్లాప్ అయిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కు ఇంకో సినిమా రాకుండా చేస్తామని చెప్పారు.

రివ్యూ రైటర్లు మంచి రేటింగులు ఇస్తే కుటుంబాలు బ్రతుకుతాయని.కొన్ని కుటుంబాలకైనా ఫీడింగ్ దొరుకుతుందని అన్నారు.

ఎవరైనా బిజినెస్ యాంగిల్ లో చూస్తే అసలు సినిమానే తీయకూడదని.ఫ్లాప్ అవుతుందని ముందే తెలియదు కాబట్టి ఫ్లాపులు తీస్తున్నామని.

ఫ్లాపులు కానీ లేకపోతే అందరం అడుక్కుతింటామని పూరీ చెప్పారు.

భార్య కోపం.. భర్త సంచలన నిర్ణయం! చెత్త కుండీలో లగ్జరీ కారు