నాగ్ పూరీ కాంబోలో మరో మూవీ.. అలాంటి కథతో..?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, స్టార్ హీరో నాగార్జున కాంబినేషన్ లో 15 సంవత్సరాల క్రితం శివమణి, సూపర్ సినిమాలు తెరకెక్కి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.

శివమణి సినిమా బ్లాక్ బస్టర్ సినిమా కావడంతో పాటు నాగార్జున కెరీర్ లోనే స్పెషల్ సినిమాగా నిలిచింది.

ఈ సినిమాను ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు అభిమానిస్తారు.అయితే సూపర్ సినిమా తరువాత నాగార్జున పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.

ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తుండగా త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా తరువాత నాగార్జున ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తారో తెలియాల్సి ఉంది.

అయితే గతేడాది లాక్ డౌన్ సమయంలో పూరీ జగన్నాథ్ నాగార్జునకు సరిపోయే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాశారని నాగార్జున ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఫాంటసీ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

"""/"/ త్వరలో నాగార్జున పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

2019 సంవత్సరంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆ తరువాత పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది.

పూరీ జగన్నాథ్ ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తున్నారు.

ఫైటర్ సినిమా ఫస్ట్ లుక్ నేడు విడుదల కానుంది.బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాతలుగా ఉన్నారు.

గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ చనిపోయినట్లుగా ప్రచారం.. అవాస్తవమన్న అమెరికా పోలీసులు