చిరంజీవి స్టాలిన్ పోస్టర్ తో అద్భుతం సృష్టించిన ప్రశాంత్ వర్మ?
TeluguStop.com
ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) ఇటీవల ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.
యంగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నటువంటి ప్రశాంత్ వర్మ ఇటీవల హనుమాన్( Hanuman ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి తేజ సజ్జ( Teja Sajja )హీరోగా హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
"""/" /
ఈ ఏడాది జనవరి నెలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా విడుదల అయ్యి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నటువంటి ప్రశాంత్ వర్మ తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాలో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించామంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఈ సినిమాలో హనుమాన్ విగ్రహం చేతులు కట్టుకొని ఎంతో గంభీరంగా చూస్తూ ఉన్నట్టు కనపడుతుంది అయితే ఆ విగ్రహాన్ని చిరంజీవి( Chiranjeevi ) స్టాలిన్ సినిమాని ( Stalin Movie ) స్ఫూర్తిగా తీసుకొని చేశామని తెలిపారు.
స్టాలిన్ సినిమాలో చిరంజీవి అలా చేతులు కట్టుకొని గంభీరంగా చూస్తూ ఉన్నటువంటి పోస్టర్ ఆధారంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాము అంటూ ప్రశాంత్ వర్మ తెలియజేయడంతో ఈ వార్త కాస్త వైరల్ గా మారింది.
ఈ విగ్రహంలో అంజేయ స్వామిని చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ.చిరంజీవి గారి పోస్టర్ ఆధారంగా దానిని రూపొందించాం.
మేము అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్17, మంగళవారం 2024