కన్నీళ్లు ఆగడం లేదు.. నాపై మరింత బాధ్యత పెంచాయి: ప్రశాంత్ వర్మ

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) ఇటీవల హనుమాన్ (Hanuman) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

నటుడు తేజ సజ్జ ( Teja Sajja ) హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది.

ఇక ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ లభించింది.

ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.ఇక ఈ సినిమాపై ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరోసారి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

"""/"/ సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్( South Indian Film Festival ) లో భాగంగా మీరు ఏ సినిమా నైనా చేయాలనుకుని చేయలేకపోయారా అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ నేను ఆంజనేయ స్వామి నేపథ్యంలో ఒక సినిమా చేయాలనుకున్నాను.

కాకపోతే ఇటీవల తేజ సజ్జన నటించిన హనుమాన్ సినిమా చూసి నాకు చాలా సంతృప్తి కలిగింది అంటూ చిరంజీవి సినిమా పై ప్రశంసలు కురిపించారు.

చిరంజీవి వేదిక పైలా మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉన్నటువంటి తేజ సజ్జ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

"""/"/ ఈ విధంగా హనుమాన్ సినిమాపై చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ వీడియోని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో అలాంటి మాటలు మాట్లాడటంతో నాపై మరింత బాధ్యతను పెంచాయని తెలిపారు.

ఈ వీడియో చూస్తుంటే నాకు సంతోషంతో కన్నీళ్లు ఆగడం లేదు.ఇక అక్కడున్న తేజ సజ్జ పరిస్థితి, అతడి సంతోషం అర్థం చేసుకోగలను అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.ఇక హనుమాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జై హనుమాన్ సినిమా( Jai Hanuman )ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రశాంత్ వర్మ సిద్ధమయ్యారు.

ఆ కారణంతోనే జబర్దస్త్ మానేశాను… మల్లెమాల వారిపై అవినాష్ షాకింగ్ కామెంట్స్!